తెలుగు సినిమా పాటల్లోని కొన్ని పదాలు ఆ తరువాత సినిమాలకి టైటిల్స్ గా పెట్టడమనేది ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ విధానం మహేష్ బాబు సినిమాతో మరోసారి మొదలైంది. మహేష్ బాబు - కాజల్ జంటగా నటించిన 'బిజినెస్ మేన్' చిత్రంలో 'సారొస్తా రొస్తారా ...' అనే పాట జనంలోకి దూసుకు పోయింది. దాంతో ఇప్పుడు ఈ పాటలోని 'సార్ వస్తారు' అనే పదాన్ని రవితేజా సినిమాకి టైటిల్ గా పెట్టేశారు. ఇక ఎన్టీఆర్ 'దమ్ము' సినిమా ఆడియో మొన్నీ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిజాన్నిదృష్టిలో పెట్టుకుని రాసిన 'రూలర్' సాంగు ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిందే.
పవర్ ఫుల్ గా ఉన్న ఈ 'రూలర్' పదాన్ని మహేష్ బాబు తదుపరి సినిమాకి టైటిల్ గా వాడనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా కోసం ఈ టైటిల్ ని నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. టాలీవుడ్ సినీవర్గాల్లో ఎన్టీఆర్ - మహేష్ బాబు లలో ఈ 'రూలర్' అనే పదానికి ఎవరు న్యాయం చేస్తారనే విషయమై అప్పుడే చర్చలు మొదలయినట్టు తెలుస్తోంది.
Post a Comment