నాగార్జునకు తమన్ మ్యూజిక్ thaman music for nag movie

ఇప్పుడు మన హీరోలు, దర్శకులు... ఎవర్ని చూసినా తమకు తమన్ కావాలంటున్నారు. అతని సంగీతానికి ఈవేళ టాలీవుడ్ లో అంతటి డిమాండ్ వుంది మరి. అందుకే బిజీ బిజీగా మారిపోయాడు తమన్. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున కూడా తన కొత్త చిత్రానికి సంగీత దర్శకుడిగా అతనికే ఓటేశాడు. దశరథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించనున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎంపికయ్యాడు. కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించే ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికగా నయనతార ఇప్పటికే ఎంపికైన సంగతి మనకు తెలిసిందే! 

Post a Comment

Previous Post Next Post