Rana met with accident in kvj krish movie [krishnam vande jagathgurum ]


 ఈమధ్య మన హీరోలు డూప్స్ లేకుండా యాక్షన్ దృశ్యాలలో పాల్గొంటున్నందువల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఈరోజు రానా దగ్గుబాటి కూడా ప్రమాదం బారిన పడ్డాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం షూటింగు హైదరాబాదులో జరుగుతుండగా ఆయన గాయపడ్డారు. ఒక బ్లాస్టింగ్ సన్నివేశంలో, హీరో రానా గాల్లోకి దూకవలసిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా హైదరాబాదులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో రానా ఎడమ చేతికి గాయమవడంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ట్రీట్ మెంటు ఇస్తున్నారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదనీ, రానా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందనీ డాక్టర్లు చెప్పారు. 

Post a Comment

Previous Post Next Post