Giribabu joins in ysr congress


సినిమాలకీ రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. మహానటుడిగా అందరి మన్ననలు అందుకున్న ఎన్టీ రామారావు రాజకీయ ప్రవేశం చేయడంతో, చాలామంది నటీనటులు ఆయనని అనుసరించారు. ఆనాటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో తారలు తమ వంతు పాత్రని చురుకుగా పోషిస్తూ వస్తున్నారు. అయితే ఈనాటి రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక సమస్యలు ... సమీకరణాలు ఈ నాటి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఏ నాయకుడికి మద్దతునిస్తారో ... ఎవరు ఏ పార్టీలో చేరతారో తెలియకుండా పోతోంది.
మోహన్ బాబు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటాడని అందరూ అనుకుంటుండగా, ఆయన ఇంటికి జగన్ రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా టీడీపీ తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని ఆయన వదులుకుంటారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు ఎటువంటి హడావిడి లేకుండానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరిపోయారు. భవిష్యత్తులో ఆ పార్టీ తరఫున ఎన్నికలలో నిలబడడానికి కూడా ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారట.

Post a Comment

Previous Post Next Post