అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ లానే సుశాంత్ కెరీర్ కూడా మొదటి నుంచీ మందకొడిగానే సాగుతోంది. కాళిదాస్ కరెంటు సినిమా లు చేసిన సుశాంత్ ఇంతవరకు ఒక్క హిట్టు కూడా లేకుండానే బండి లాగించేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తను హీరోగా తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ నాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. పూరీ జగన్నాథ్ వద్ద పనిచేసిన సాయిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. దీనికి 'అడ్డా' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చే ఈ చిత్రం షూటింగును త్వరలో ప్రారంభిస్తారు. ఇదిలా ఉంచితే, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్నట్టు గతంలో వార్తలొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఆ చిత్రం సెట్స్ కు వెళ్లకుండానే అటకెక్కేసిందట! భవిష్యత్ లో సుశాంత్ కి మరిన్ని సినిమా లు రావాలని ఆశిద్దాం అల్ ది బెస్ట్ సుశాంత్

Post a Comment