
సినీ పరిశ్రమ లో హీరోగా నిలదొక్కుకోవడమనేది అనుకున్నంత ఈజీ కాదు ... కామెర ఆక్షన్ అనే అంత సింపుల్ కూడా కాదు . అలాంటి పరిశ్రమ లో అరుదైన స్థానానికి అంచెలంచెలుగా ఎదిగాడు ,'మహాత్మా' సినిమాతో సెంచరి కొట్టాడు వంద సినిమాల పూర్తిచేసాడు మన హీరో శ్రీకాంత్!
గుండ్రని ముఖం ... చక్కని క్రాఫ్ ... చొట్ట బడిన గెడ్డం పరవాలేదు కుర్రాడు బాగానే వున్నాడు ఈ కుర్రాడు నటుడిగా సినిమాలు చేస్తూ స్థిర పడతాడు అనుకున్నారు ... ఇలా వంద చిత్రాలకి పైగా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. 1991 లో 'పీపుల్స్ ఎన్ కౌంటర్' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీకాంత్, 'సీతారత్నం గారి అబ్బాయి' ... 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' ... 'వారసుడు' వంటి సినిమాలను ధన ధన పూర్తి చేసుకు వెళ్లి పోయారు. నెగిటివ్ టచ్ ఉన్న ఈ పాత్రల్ని తన దైన స్టైల్లో పండించి, ఆడియన్స్ తో శాబాష్ అనిపించుకున్నాడు
మనోడు లో హీరో అయ్యే లక్షణాలు కావాల్సినన్ని వున్నాయని గ్రహించడానికి ఇటు ఇండస్ట్రీకి గానీ ... అటు ఆడియన్స్ కి గాని ఎక్కువ సమయం పట్టలేదు. 'దొంగ రాస్కెల్' చిత్రంతో సోలో హీరోగా మారిపోయిన శ్రీకాంత్ కి 'ఆమె' ... తాజ్ మహల్' ... పెళ్లి సందడి' వంటి సూపర్ హిట్స్ లు రానే వచాయి కథానాయకుడు కావడం ఒక ఎత్తైతే ... ఆ స్థానాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. అందుకు ఎవరైనా ఫ్యామిలి సెంటిమెంట్ చిత్రాలను ఆశ్రయించవలసిందే. శ్రీకాంత్ కూడా ఆ దిశగానే అడుగులు వేశారు ... మహిళా ప్రేక్షకుల నుంచి మరిన్ని మార్కులు కొట్టేశారు.
ట్రెండ్ ను సృష్టించే కథానాయకులు కొందరైతే ... ఆ ట్రెండ్ తో పాటు కొనసాగే కథానాయకులు మరికొందరు. ఆ రెండింటిని అనుసరించిన కథానాయకుడు శ్రీకాంత్. అత్యధిక సంఖ్యలో ఆయన చేసిన మల్టీ స్టారర్ చిత్రాలే అందుకు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. శ్రీకాంత్ చేయని హీరో లేదు చిరంజీవి నాగార్జున వెంకటేష్ తాజాగా బాలయ్య అందరితో ను శ్రీకాంత్ నటించాడు నటీనటులకు తమ నటనా సామర్ధ్యాన్ని నిరూపించుకునే పాత్రలు ... తమ నటనలోని నాణ్యతను నిర్ధారించుకునే పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అవకాశాలు శ్రీకాంత్ కి అవలీలగా దక్కడం ఆయన అదృష్టమేనని చెప్పాలి.
'ఖడ్గం' ... 'ఆపరేషన్ దుర్యోధన' ... 'మహాత్మ' వంటి చిత్రాలు శ్రీకాంత్ నట విశ్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. లవ్ - సెంటిమెంట్ - కామెడి - యాక్షన్ చిత్రాలతో ఇటు క్లాస్, అటు మాస్ ఆడియన్స్ ని అభిమానులుగా చేసుకోవడం ఒక్క శ్రీకాంత్ కే సాధ్యమైందని చెప్పొచ్చు. సమర్ధుడైన నటుడిగా, సక్సెస్ ఫుల్ హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీకాంత్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భాగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మా TELUGUCINEMAS.IN - మీ సందీప్
Post a Comment