ఆస్పత్రిలో చేరిన మనోరమ actress manoram in hospital

 

ప్రముఖ నటి మనోరమ అనారోగ్యంతో గురువారం ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని మైలాపూర్‌లోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దక్షిణాది సినీ వినీలాకాశంలో హాస్యనటిగా, అక్కగా, అమ్మగా, అత్తగా, బామ్మగా...ఇలా ఎన్నో వైవిధ్య పాత్రల్లో వెండితెరపై కన్పించిన మనోరమ(70)కు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నారు. 

గతంలో మోకాళ్ల నొప్పులకు ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇటీవల స్నానాలగదిలో జారి పడటంతో తలకు బలమైన గాయం అయింది. రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ వస్తున్న మనోరమ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తనయుడు భూపతి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

Post a Comment

Previous Post Next Post