సర్వీస్‌ ట్యాక్స్‌ ఎత్తి వేత.no service tax on films

 

సినీ పరిశ్రమలో సర్వీస్‌ ట్యాక్స్‌ను ఎత్తి వేయాలని ఇటీవలే దేశవ్యాప్త సమ్మెను చేసిన ఈ రంగానికి శుభవార్తను వినిపించారు కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ(కానీ తెలుగు చలనచిత్రరంగం మాత్రం సమ్మెలో పాల్గొనలేదు). నిర్మాతలకు భారంగా ఉన్న సర్వీస్‌ ట్యాక్స్‌ను ఎత్తి వేస్తూ 2012-2013 వార్షిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రకటించడాన్ని తెలుగు సినిమారంగ దర్శకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతలు విన్నవించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ ప్రకటన చిన్న నిర్మాతలకు ఊపిరినిచ్చింది. ఈ నిర్ణయంపై సౌత్‌ ఇండియా ఫిలిమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ కూడా హర్షం వ్యక్తం చేశారు. 

Post a Comment

Previous Post Next Post