మరోసారి 'సార్' తో కాజల్! kajal opposite mahesh babu once again



ఇటీవల వచ్చిన 'బిజినెస్ మేన్' సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మహేష్ బాబు, కాజల్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క చిత్రంతోనే హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట తాజాగా మరో భారీ చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే చిత్రంలో మహేష్ పక్కన కథానాయికగా తాజాగా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. వచ్చే నెలాఖరులో ఈ చిత్రం షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంచుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, డేట్స్ సమస్య వల్ల ఆమె ప్రాజక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మరి కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ, చివరికి కాజల్ కే ఆ అవకాశం దక్కింది! 

Post a Comment

Previous Post Next Post