సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకీ ... యాక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబానికీ మధ్య సన్నిహిత సంబంధాలు వున్నాయి. అతని టేకింగ్ స్టైల్ ని ఇష్టపడే మంచు లక్ష్మీ ప్రసన్న - మనోజ్ లు అతని డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కారణంగానే అతను ఆ మధ్య కాలంలో తీసిన 'దొంగలముఠా' చిత్రంలోనూ ... తాజాగా తెరకెక్కిస్తోన్న 'డిపార్ట్ మెంట్' చిత్రంలోను లక్ష్మీ ప్రసన్నకి అవకాశం ఇచ్చాడు. ఇక త్వరలో అతని డైరెక్షన్లో మనోజ్ కూడా చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ తన సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఒక్కోసారి తన సినిమాల్లో తానే యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. దాంతో మనోజ్ పై రాంగోపాల్ వర్మ దృష్టిపడిందని అంటున్నారు. ఎప్పటి నుంచో ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ పై సినిమా తీయాలనుకుంటోన్న వర్మ, ఇక తనకు కథానాయకుడు దొరికిపోయాడని అనుకుంటున్నాడట. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి తను తెరకెక్కించే ఆ సినిమాలో మనోజ్ కి లీడ్ రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది. ఏది ఏమయినా వర్మ వరస సినిమా ల తో బిజీ అవుతున్నడన్నమాట | ||||
Post a Comment