
మంచు ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై 'ఊకొడతారా ... ఉలిక్కిపడతారా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ - దీక్షా సేథ్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలకృష్ణ జమీందారుగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో లక్ష్మీ ప్రసన్న కూడా ఓ కీలకమైన పాత్రని పోషిస్తోంది. ఇటీవల ఆమెపై పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. మనోజ్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ లో లక్ష్మి డూప్ లేకుండా ఫైట్లు చేసిందట. ఆమె ఆ స్థాయిలో రియల్ గా ఫైట్ సీన్లలో పాల్గొనడం తనకి ఆనందాశ్చర్యాలను కలిగించిందంటూ మనోజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. తెలుగు - తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Post a Comment