కాకతీయ సామ్రాజ్యపు కీర్తిని నలుదిశలా చాటిన వీరవనిత రాణి రుద్రమదేవి పాత్రను పోషించడానికి అందాలరాణి అనుష్క అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. రుద్రమదేవి కథను తెరకెక్కించడానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒకవిధంగా చెప్పాలంటే, ఇది ఆయనకు డ్రీమ్ ప్రాజక్ట్! ఈ చిత్రాన్ని నభూతో నభవిష్యతి... రీతిలో భారీ బడ్జెట్ తో రూపొందించాలన్నది గుణ శేఖర్ ప్రయత్నం. అందుకు తగ్గా స్క్రిప్టును ఆయన ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.
చిత్రంలోని ప్రధాన పాత్ర అయిన రుద్రమదేవి వేషానికి పలువురు కథానాయికలను సంప్రదించాడు కూడా. వారిలో అనుష్క కూడా వుంది. ఎంతగానో ఆలోచించిన మీదట అనుష్క తాజాగా ఈ పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాలు పూర్తయిన వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకారం తెలిపిందట. కాకతీయుల కాలం నాటి వాస్తవ లోకేషన్లతో బాటు, భారీ సెట్స్ లో కూడా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని అంటున్నారు.
Post a Comment