విడుదలకి ముందే 'రచ్చ'ఫై రచ్చ మొదలైంది. రామ్ చరణ్ - తమన్నా జంటగా నటిస్తున్న 'రచ్చ' కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాళ్లని నిరాశ పరచగూడదనే ఉద్దేశంతో ఈ సినిమాకి సంబంధించిన బ్యాలన్స్ వర్క్ ను కూడా పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ఒకటి అనుకోని వివాదానికి తెరతీసింది. ఈ సినిమాలోని ఓ పాటలో బుద్ధుడి విగ్రహం ఎదుట నాయికా నాయకులు అసభ్యకరమైన భంగిమలతో కూడిన డాన్స్ చేశారని జాతీయ స్త్రీ శక్తి సంఘం అనే మహిళా సంఘం పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఈ రోజు హోమ్ మినిష్టర్ సబితా ఇంద్రా రెడ్డిని కలిసి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరనుంది. ''వానా వానా వెల్లువాయే '' అనే పాటలో బ్యాక్ గ్రౌండ్ సెట్ ప్రోపర్టీలో బుద్ధుడి షేప్ ఒకటి కనిపిస్తుండటంతో, ఈ వివాదం తలెత్తింది. మరి ఇది ఎలాంటి మలుపులకి కారణమౌతుందో ... ఎలాంటి మార్పులకి దారితీస్తుందో ... ! ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ యకర్స్ [7acres ] లో ఈ సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది ఈ సినిమా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదలవుతుంది
'రచ్చ' మొదలైంది! controvery on ramcharan racha
telugucinemas
0
Tags
General News
Post a Comment