'సీతమ్మ వాకిట్లో' మహేష్ బాబు ఫైట్! mahesh fight in seethamma vakitilo


వెంకటేష్ - మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తోన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన పోరాట సన్నవేశాలను ఎల్లుండి మహేష్ బాబు పై చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ లో ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో ఈ దృశ్యాల్ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంత వరకూ 30 % పూర్తయిందనీ ... అక్టోబర్ లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. విడుదలకి ముందే ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న ఈ సినిమా, విడుదల తరువాత ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలని అటు వెంకటేష్ అభిమానులు ... ఇటు మహేష్ ఫ్యాన్స్ మాంఛి  ఉత్సాహంగా వున్నారు. 

Post a Comment

Previous Post Next Post