రామ్ చరణ్, తమన్నా జంటగా నటిస్తున్న 'రచ్చ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డబ్బింగ్ చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం హీరో చరణ్ సెకండాఫ్ కు సంబంధించిన డబ్బింగును చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇక షూటింగు విషయానికొస్తే, రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి వుంది. ఇటీవల షూటింగులో చరణ్ గాయపడడంతో ఈ చిత్రీకరణ ఆలస్యమవుతోంది. త్వరలోనే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ 'రచ్చ' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రంలోని పాటలు హైదరాబాదులో జరిగిన ఓ వేడుకలో చిరంజీవి రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి హిట్ నంబర్ 'వానా వానా వెల్లువాయే' ను రీమిక్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే! |
Post a Comment