.jpg)
తెలుగు తెరపై హేమాహేమీలంతా నటిస్తున్న చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’. రచయిత జేకే భారవి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో డా.మోహన్‌బాబు ‘రుద్రాక్షస్వామి’గా నటిస్తున్నారు. కాగా నాగార్జున, శ్రీహరి, ప్రకాష్‌రాజ్, జయప్రద, రోజా, మీనా, పోసాని కృష్ణమురళి, విజయ్‌చందర్, కామ్నా జఠ్మలాని, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కూడా కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.
టైటిల్ రోల్‌లో కౌశిక్‌బాబు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై నారా జయశ్రీదేవి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ తరానికి మన భారతీయ మూలాల విలువలు కచ్చితంగా తెలియాలి. అందుకే ఆదిశంకరుని జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నాం’’ అని చెప్పారు. నారా జయశ్రీదేవి మాట్లాడుతూ -‘‘95 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఇటీవలే మోహన్ బాబు, శ్రీరామచంద్ర, పోసాని, విజయ్‌చందర్, కామ్నా జఠ్మలాని, కన్నడ హీరో వాసు తదితరులపై కీలక ఘట్టాలను తీశాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. 18 మంది ప్రముఖ గాయనీ గాయకులు ఈ సినిమా కోసం పాటలు పాడారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పీకేహెచ్ దాస్, సంగీతం: నాగ్ శ్రీవత్స, పాటలు: ఆదిశంకరాచార్య, వేదవ్యాసు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్: ఉదయ్‌భాస్కర్.
source sakshi
Post a Comment