Home » » Teja Sajja Heart Felt Note on Completion of 25 Years in Tfi

Teja Sajja Heart Felt Note on Completion of 25 Years in Tfi

 తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ



మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్‌  దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’. నిర్మాతా అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద  రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతోనే బాలనటుడిగా అరంగేట్రం చేశారు హీరో తేజ సజ్జ. ఈ సినిమా విడుదలై నేటితో  25 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అశ్వినీ దత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ నోట్ రాశారు తేజసజ్జ.


‘’25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు.  ఏమి జరుగుతుందనే అవగాహన లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది.

ఎంతో దయకలిగిన లెజెండ్‌తో తెరపై నా మొదటి పెర్ఫార్మెన్స్ మొదలైయింది. ఇప్పుడు హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నాను.  ఇదంతా కలలా అనిపిస్తుంది. ఈ కల మీ అందరివలనే  జీవం పోసుకుంది.    

మీరంతా  నా కుటుంబం.  ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి కారణం మీ ప్రేమ, ఆదరణ.


గుణశేఖర్ గారు, చిరంజీవి గారు, అశ్వినీదత్ గారు మీరంతా ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు

ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో వుంటాను.

-తేజసజ్జ



Share this article :