Woh Kuda Song From 8AM Metro sung by Nooran Sisters

 8 AM Metro సినిమా కి నూరాన్ సిస్టర్స్ తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్ 



నూరాన్ సిస్టర్స్ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సూఫీ నేపధ్యంలో వాళ్ళు పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం  8 AM Metro అనే సినిమా కోసం వాళ్ళు పాడిన పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఈద్ పండుగ సందర్భంగా “Woh Kuda” అనే ఈ పాటను మూవీ టీం రిలీజ్ చేసారు. ఈ సాంగ్ వీడియో లో నూరాన్ సిస్టర్స్ అయిన సుల్తానా నూరాన్, జ్యోతి నూరాన్ ఇద్దరూ పాట పాడుతూ కనపడటం విశేషం.


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం, జాంబీరెడ్డి, ఘోస్ట్ వంటి తెలుగు హిట్ మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన మార్క్ కె. రాబిన్ ఈ సినిమాకు స్వరాలందించారు. ప్రస్తుతం వస్తున్న పెద్ద బాలీవుడ్ సినిమాల పాటలకు సరి తూగే విధంగా ఈ సాంగ్ ఉందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మల్లేశం మూవీ డైరెక్టర్ రాజ్.ఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మల్లేశం సినిమాకు జాతీయ స్థాయిలో ప్రసంశలతో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి.



“హేట్ స్టొరీ”, “హంటర్” లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన గుల్షన్ దేవయ్య ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నారు. సుప్రీం హీరో సాయి ధరం తేజ్  మొదటి సినిమా “రేయ్” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సయామీ ఖేర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలయిన పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారి చివరకు ఏమయ్యింది.? అన్నట్లుగా ఉన్న కథను దర్శకుడు ముందే ఆడియన్స్ కి రివీల్ చేసేసారు. 



ఈ సినిమాకు సంబంధించి మిగిలిన పాటలు కూడా త్వరలో రిలీజ్ అవబోతున్నాయి.  కిషోర్ గంజి, రాజ్ .ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 19 న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

Post a Comment

Previous Post Next Post