Home » » Priyamaina Priya Movie Trailer and Audio Launched

Priyamaina Priya Movie Trailer and Audio Launched

 ఘనంగా ప్రియమైన ప్రియ  మూవీ ట్రైలర్ &ఆడియో లాంచ్



గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై  అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్  హీరోహీరోయిన్ లు గా  A. J సుజిత్ దర్శకత్వం వహించిన  సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " ప్రియమైన ప్రియ.  A J. సుజిత్ ,A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్  ఆడియో రిలీజ్ ఫంక్షన్  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు..ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు  100 వ చిత్రం కావడం విశేషం..  ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బసి రెడ్డి ,నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ,సీనియర్ జర్నలిస్ట్ పాశం యదగిరి , ప్రొడ్యూసర్ ఎంఆర్‌ చౌదరి వడ్లపట్ల ముఖ్య అధితులు హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు.. సి.హెచ్‌ సీతారామ్ యాదవ్  నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈ

మూవీని మన స్క్రీన్  మ్యాక్స్  డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.   అనంతరం



ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్ కె.ఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ.. “ ఈ చిత్రం క్వాలిటీ పరంగా హైస్టాండర్డ్స్ ఉంది.. విజువల్స్ ఎక్స్‌ట్రార్డనరీగా తీసారు.. డీఓపీ కి ప్రత్యేక అభినందనలు.. కొత్త కుర్రాడైనా హీరో అశోక్‌ ఎక్స్‌ట్రార్డనరీగా పర్‌ఫార్మ్‌ చేసారు.. హీరో లీషా అందంతో పాటు యాక్టింగ్‌లోనూ చూడముచ్చటగా ఉంది" అంటూ చిత్ర యూనిట్‌ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్‌ శ్రీకాంత్ దేవా ను, మ్యూజిక్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ..  శ్రీకాంత్ దేవా తండ్రి గారు ప్రముఖ సంగీత దర్శకులు దేవాతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. దర్శకులు సుజీత్‌, నిర్మాణ నిర్వహణ సీతారామ్‌ యాదవ్‌ ను చిత్ర యూనిట్‌ను అభినందించారు.


సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి గారు మాట్లాడుతూ... ఆకాశాన హడావిడిగా పరిగెత్తుతున్న జగన్నాధ రథచక్రాలను భూమార్గం పట్టిస్తా... భూకంపం పుట్టిస్తా.. అన్న శ్రీశ్రీ మాటలను గుర్తు చేస్తూ... ఈ చిత్రాన్ని కూడా భూమార్గం పట్టించి సక్సెస్‌తో భూకంపం పుట్టిస్తా అంటూ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. దర్శకుడు సుజీత్ ప్రతిభను, సాంకేతిక వర్గాన్ని, ను ప్రత్యేకంగా అభినందించారు. కొత్త ముఖాలైనా అద్భుతంగా నటించారంటూ హీరోహీరోయిన్స్‌ను మెచ్చుకున్నారు.  


మ్యూజిక్ డైరెక్టర్‌ శ్రీకాంత్ దేవా మాట్లాడుతూ.. ఈ చిత్రం నా కెరీర్‌లో 100 వ చిత్రం. తన తండ్రిగారు ప్రముఖ సంగీత దర్శకులు దేవా.. తొలిప్రేమ వంటి ఎన్నో సూపర్‌ హిట్స్ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తండ్రి లాగే తానను కూడా  ప్రోత్సాహించాలనీ,  తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు, సపోర్ట్‌ చేయాలని కాంక్షించారు.


హీరో అశోక్‌ మాట్లాడుతూ..  ఈ చిత్రం ఒక మంచి సైకో థ్రిల్లర్‌. ఇందులో హీరో నేనే, సైకో నేనే . యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే అద్భుతమైన చిత్రం ఇది. తమిళ్‌, తెలుగులో అద్భుతమైన మ్యూజిక్ అందించిన శ్రీకాంత్ దేవా గారి 100 సినిమా ఇది. నేను హీరోగా యాక్ట్‌ చేస్తున్న చిత్రానికి శ్రీకాంత్ దేవా గారు మ్యూజిక్ అందించడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. కంటికి  కనబడే పూజించు వారందరూ సైకోలే అనుకుంటే. మధురమైన గొంతును ఆరాధించే నేనే పెద్ద సైకో.. ఈ డైలాగ్ హీరోయిన్ తో చెప్తాను కానీ.. మధురమైన గొంతు మాత్రం శ్రీకాంత్ దేవా గారిది.. అంటూ మ్యూజిక్ డైరెక్టర్‌ శ్రీకాంత్ దేవా గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. హీరోయిన్ లీషా కు బెస్ట్ విషెస్ తెలియజేసారు.


హీరోయిన్‌ లీషా మాట్లాడుతూ..  ఈ చిత్రం ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఆహ్వానితులందరికీ నమస్కారం తెలియజేస్తూ... ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలనీ.. ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రాన్ని చేర్చి అందరూ  ఈసినిమాను చూసేలా చేయాలంటూ మీడియాను అభ్యర్ధించారు. లేడీ ప్రొడ్యూసర్‌ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషిస్తున్నాను అంటూ చిత్రాన్ని సక్సెస్‌ చేయాలంటూ కోరారు.


ఈ కార్యక్రమంలో Mr చౌదరి వడ్లబట్ల ,చిన్న గౌడ్ , పులి అమృత్ , ck మాయ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ ch. మాయ  ,నటుడు శశాంక్  పలువురు పాల్గోన్నారు


హీరో హీరోయిన్స్ : అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్

దర్శకత్వం : A. J. సుజిత్

నిర్మాతలు : J సుజిత్ - A బాబు

సహా నిర్మాత : కె. లక్ష్మీకాంత్

కెమెరా : షా

సంగీతం : శ్రీకాంత్ దేవా

ఎడిటింగ్ : కె.ఇత్రిస్

మాటలు : మోహన్ కుమార్

కో డైరెక్టర్స్ : శివ sheker - డి అరుల్ రాజ్

స్టంట్స్ : డేంజర్ మణి

డాన్స్ : రవి దేవ్

ఆర్ట్ : ఎన్ .నందకుమార్

సింగర్స్ : చెరువూరి విజయ్ కుమార్ ,శ్రేష్ఠ

నిర్వహణ : కె.గోవిందన్

నిర్మాణ నిర్వహణ : సీతారామ్ యాదవ్

ప్రొడక్షన్  కంట్రోలర్ : సురేష్ రాజ్ -ఎస్ ఏ తౌపిక్

లైన్ ప్రొడ్యూసర్ : R Mబాబు - PA జార్జ్ రత్నం

డిజైన్స్ :  వెంకట్ ఆర్.కె


పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్


Share this article :