Home » » Hero Sai Dharam Tej Interview About Virupaksha

Hero Sai Dharam Tej Interview About Virupaksha

 అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. 'విరూపాక్ష'పై సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్



సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..


ఇప్పుడు కాస్త వయసు పెరిగింది. మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్‌ అయితే అందరం హ్యాపీగా ఉంటాం. రికార్డ్స్ బద్దాలని కొట్టాలనేం అనుకోం. ప్రతీ వారం ఓ రికార్డ్ బ్రేక్ అవుతుంటాయి. రికార్డులంటేనే బ్రేక్ అవుతుంటాయి.


80, 90వ దశకంలో ఈ కథ ఉంటుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏంటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ విరూపాక్ష. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే విరూపాక్ష అని టైటిల్ పెట్టాం.


మొదటి సారి ఇలాంటి కొత్త జానర్‌ చేశాను. నేను ఇంతకు ముందు జీవించాను. కానీ ఇప్పుడు మాత్రం నటించాను. ప్రతీ ఒక్క హీరోకి ప్రతీ సినిమా మొదటి సినిమాలానే ఉంటుంది. అలానే కష్టపడతారు.


ఈ సినిమాను కాంతారాతో పోల్చను. అది కల్ట్ క్లాసిక్ సినిమా. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇండియానా జోనస్ సినిమాలు నాకు చాలా ఇష్టం.


హారర్ సినిమాలు చూడటం వేరు. చేయడం వేరు. ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ నాకు మళ్లీ మాటలు నేర్పించారు. నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. 36 ఏళ్ల వయసులో మళ్లీ నాకు మాటలు నేర్పించారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి.


నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను.


80, 90వ దశకంలోని కథ కాబట్టి.. అప్పట్లో ప్రేమలు ఎలా ఉండేవో తెలుసుకున్నాను. అవన్నీ రీసెర్చ్ చేశాం. సెట్‌లో నాకు అందరూ సపోర్ట్ చేశారు. అన్ని భయాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలనేది నేను నమ్ముతాను. ఈ సినిమాలో కథ కూడా అలానే ఉంటుంది.


ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. మీడియా సపోర్ట్‌తో ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుంది. మన తెలుగుదనాన్ని పాన్ ఇండియాకు తీసుకెళ్తున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకున్నాం. అందుకే ముందు తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. తరువాత అన్ని భాషల్లో విడుదల చేస్తాం.


సుకుమార్ రైటింగ్స్ అంటే ప్రేమ కథలుంటాయి. ఈ సినిమాలోనూ అండర్ లైన్‌గా లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూశాకా ఆడియెన్స్‌కే అర్థం అవుతంది. నేను ఇప్పుడేం చెప్పలేను. ఇది టిపికల్ జానర్. సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే సినిమాకు అద్భుతంగా సెట్ అయింది.


వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి ఏమీ బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అడ్జస్ట్ అయ్యేవారు. మా నిర్మాతలు నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. ఆ విషయంలో వారికి వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే.


నా జీవితం అన్నీ సవాళ్లతోనే నిండింది. నేను ఎప్పుడూ కొత్త సవాళ్లని స్వీకరించేందుకు సిద్దంగానే ఉంటాను. అయినా సవాళ్లనేవి లేకుంటే జీవితం చప్పగా అనిపిస్తుంది.


కార్తీక్ 2019లో నాకు కథ చెప్పాడు. హరీష్ అన్నా, అనిల్ అన్నా, మారుతి అన్నా తరువాత అంత బాగా నాకు నెరేట్ చేశాడు. అప్పుడు నాకు ఎంతో నమ్మకం కలిగింది. సినిమాను అద్భుతంగా తీస్తాడని అనిపించింది. సుకుమార్ గారు కేవలం స్క్రీన్ ప్లే ఇచ్చారు. కార్తీక్ డైరెక్ట్ చేశారు.


విక్రాంత్ రోణ సినిమాను చూసి అజనీష్ గారిని తీసుకున్నాం. ఇందులో పాటలకు ఎక్కువ స్కోప్ ఉండదు. షెర్లాక్ హోమ్స్ టైపులో ఉంటుంది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఏదో ఒక కొత్త కారెక్టర్ వస్తుంది.. పాటలతో బోర్ కొట్టించాలని మేం అనుకోలేదు.


నాకు మాస్ ఇమేజ్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్‌ కారెక్టర్ వచ్చిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓ మంచి సినిమాను చేయాలని, మంచి కారెక్టర్ చేయాలని అనుకునే చేశారు. ఏదో ఒక ఇమేజ్ వస్తుందని ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. విరూపాక్ష సినిమాకు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉంటారు. కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.


నిర్మాత ప్రసాద్ గారు, బాపీ అన్న నాకు ముందు నుంచీ తెలుసు. ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి వారు నాకు తెలుసు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయనలో నాకు అదే ఇష్టం.


ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తోంది. మన తెలుగుదనాన్ని పాన్ ఇండియా వైపు తీసుకెళ్లాలి. ఇప్పుడు మన స్థాయి పెరిగింది. ప్రపంచానికి మనం తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాం. 


సంయుక్త నిజంగానే గోల్డెన్ లెగ్. ఏ పాత్రకు ఎంత చేయాలో ఆమెకు చాలా తెలుసు. సంయుక్త చాలా మంచి నటి. ఆమె ఆలోచన ధోరణి గొప్పగా ఉంటుంది.


ఈ సినిమా నాలోని నటుడ్ని పరీక్ష పెట్టినట్టు అనిపించింది. చాలెంజింగ్‌గా అనిపించింది. 80, 90వ దశకంలో ఎలా ఉండేవారు.. ఎలా ప్రవర్తించేవారు.. ఎలా కనిపించాలి? ఇలా ప్రతీ ఒక్క అంశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. చిత్రలహరి నుంచి ప్రతీ పాత్రకు సంబంధించి నేను నోట్స్ రాసుకుంటూ వస్తూనే ఉన్నాను.


జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి గారు ఓ కొటేషన్ పంపించారు. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి' అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించారు.


Share this article :