Home » » Santosham Awards Streaming on Aha

Santosham Awards Streaming on Aha

 ఆహా ఓటీటీలో సంతోషం అవార్డ్స్ స్ట్రీమింగ్ 




సంతోషం మ్యాగజైన్ పేరుతో ప్రతి వారం సినీ పరిశ్రమలో జరుగుతున్న విశేషాలు అప్డేట్స్ సహా మరెన్నో విషయాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సురేష్ కొండేటి. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న సంతోషం అవార్డుల కార్యక్రమం సౌత్ ఇండియాలో సూపర్ ఫేమస్. గత ఏడాది 2022 సంతోషం అవార్డుల ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈవెంట్ డిసెంబర్ 26వ తేదీన ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ జరిగిందని తెలుసు కానీ ఈ ఈవెంట్ కి సంబంధించిన విశేషాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఆహా సంస్థ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. మార్చ్ 16 అర్ధరాత్రి నుంచి అంటే మార్చ్ 17 తెల్లవారు జాము 12 గంటల నుంచి ఈ ఈవెంట్ స్ట్రీమ్ అవుతుంది. సాధారణంగా అవార్డుల వేడుకలు ఇప్పటివరకు సాటిలైట్ చానల్స్ ద్వారా ప్రసారం అయ్యేవి లేదా యూట్యూబ్ లో ప్రసారమయ్యేవి. కానీ మొట్టమొదటిసారిగా ఆహా ఓటీటీ సంస్థ సంతోషం హక్కులు భారీ రేటుకు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా ఇది తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటీటీలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రసారం చేస్తున్నారు. అలాంటిది ఒక అవార్డుల ఈవెంట్ హక్కులు కొనుక్కుని ఒక ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేయటం అనేది టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు. కేవలం ఈ సంతోషం అవార్డ్స్ స్ట్రీమింగ్ మాత్రమే కాదు గతంలో కూడా సురేష్ కొండేటి అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆహా వీడియో సంస్థ అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసింది. చూసేయండి.


Share this article :