Home » » Dasara Pre Release Event Held Grandly

Dasara Pre Release Event Held Grandly

‘దసరా’తో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. దసరా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని



దసరా అన్ని ఎలిమెంట్స్ వున్న ఫుల్ ప్యాకేజీ: కీర్తి సురేష్


 


నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో అనంతపురంలో దసరా దూమ్ ధామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. 


 


ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మిమ్మ్మల్ని మెప్పించే మాస్ చూసి వుంటారు. దసరాతో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్ తో విజిల్స్ వేసే ఆనందం దసరాతో ఎక్స్ పీరియన్స్ చేస్తారు. దసరా చాలా మనసుకు దగ్గరైనా సినిమా. ఏడాది కాలం పాటు దమ్ము ధూళి.. చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. దసరా లాంటి గొప్ప ప్రాజెక్ట్ ని నిర్మించిన నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. నా ఫ్రండ్స్ పాత్రలు చేసిన నటులందరికీ థాంక్స్.ఈ సినిమా మన కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. కాసర్ల శ్యాం గారు రాసిన ప్రతి పాట సంచలనం అవుతుంది. ఫైట్ మాస్టర్ సతీష్.. ఈ సినిమాతో ఆయన డేట్లు దొరకవు. దసరాలో యాక్షన్ వేరే లెవల్ లో చేశారు. సత్యన్ సూర్య, శ్రీకాంత్,  సంతోష్ నారాయణ్ మీ అందరికీ పర్ఫెక్ట్ మూవీని ఇవ్వడానికి చివరి నిమిషం వరకూ కష్టపడుతున్నారు. వారు పడుతున్న కష్టం మార్చి 30న మీరు చూస్తారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు 22 ఎకరాల్లో వీర్లపల్లిని క్రియేట్ చేశారు. మీరు 30న థియేటర్ లో అడుగుపెట్టిన వెంటనే ఆ వూర్లోకి తీసుకెళ్ళిపోతాం. ఎడిటర్ నవీన్ క్రిస్ప్ గా ఎడిట్ చేశారు. సూరి పాత్రలో దీక్షిత్ అద్భుతంగా చేశాడు. సాయి కుమార్ గారు, సముద్రఖని గారు షైన్ టాం చాకో ఇలా అందరూ అద్భుతంగా చేశారు. నేను లోకల్ తర్వాత నేను కీర్తి కలిసి చేస్తే ఒక మెమరబుల్ సినిమా చేయాలని అనుకున్నాం. దసరా కి మించిన మెమరబుల్ మూవీ అంత ఈజీగా ఏ నటులకి   దొరకదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్...  వినయ్, హరి, శ్రీనాథ్, రోహిత్, రవి కుమార్, అర్జున్, యశ్వంత్మ్ వంశీ చిన్న రవి , రామ్ పవన్ మధు.. అందరికీ థాంక్స్. త్వరలోనే వీళ్ళంతా దర్శకులైపోవాలని కోరుకుంటున్నాను. రైటర్ తోట శ్రీను గారికి థాంక్స్. ఈ వేడుక ని ఇంత గ్రాండ్ గా నిర్వహించడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు. పీవీకే కాలేజ్ మ్యానేజ్ మెంట్ కి థాంక్స్. మా పీఆర్వోలు వంశీ శేఖర్ కి థాంక్స్. అలాగే అలాగే ప్రమోషన్స్ లో ఎంతో సహకరించిన అనురాగ్ కి కృతజ్ఞతలు. దసరా టాప్ లేచిపోయే సినిమా. మార్చి 30న మీకు మేము ఇస్తున్నాం. టాపు లేచిపోయే రెస్పాన్స్ మీరు మాకివ్వండి. ఈ అనుబంధం ఇలానే కొనసాగుతుంది. కష్టపడుతూనే వుంటాను. మంచి సినిమాలు మీకివ్వడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.


 


కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాని అభిమానులకు ఒక విషయం చెప్పాలి. ధరణి కత్తి పట్టాడు. మార్చి 30న చూద్దాం. నేను నాని కలసి నేను లోకల్ అనే సినిమా చేశాం. కానీ దసరానే  నాకు లోకల్ అనిపిస్తుంది. నాని గొప్ప స్నేహితుడు, సహా నటుడు. ఈ సినిమా తర్వాత మీ అందరికీ వెన్నెలగా గుర్తుంటాను. దర్శకుడు శ్రీకాంత్ చాలా కష్టపడి ఈ కథని రాశారు. ఈ కథని ఇంతపెద్ద కాన్వాస్ రూపొందించే అవకాశం ఒక కొత్త దర్శకుడికి ఇచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. దసరా అన్ని ఎలిమెంట్స్ వున్న ఫుల్ ప్యాకేజీ. డీవోపీ సత్యన్ సూర్యన్ గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సంతోష్ నారయణ్ సంగీతం ధూమ్ ధాంగా ఇండియా అంతా ఇరగదీస్తుంది. నవీన్ నూలీ కట్స్ అన్నీ అదిరిపోయాయి. అవినాష్ గారితో మహానటి తర్వాత దసరా చేశాను. ఇందులో నా స్నేహితులుగా నటించిన అందరికీ కృతజ్ఞతలు. జాన్సీ గారు సాయి కుమార్ సముద్ర ఖని షైన్ టాం చాకో ఇలా అందరూ అద్భుతంగా చేశారు. సూరి పాత్రలో దీక్షిత్ నటన అద్భుతంగా వుంటుంది. మార్చి 30 దసరా మీ ముందుకు వస్తుంది. ఎట్లయితే గట్లయితది చూసుకుందాం’’ అన్నారు. 


 


దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. దసరా లాంటి వండర్ పుల్ ప్రాజెక్ట్ లో నన్ను రిఫర్ చేసిన దసరా కో డైరెక్టర్ వినయ్ గారి కృతజ్ఞతలు. దీప్తి మేడం గారికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ గారు నన్ను ఎంతో కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. ఆయన దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదుగుతారు. నాని గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమా కోసం టూర్ చేస్తున్నపుడు నన్ను చిన్నపిల్లాడి చేయి పట్టుకొని స్టేజ్ పై తీసుకొచ్చి నా గురించి చెప్పి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాని గారికి ఎప్పుడూ రుణ పడి వుంటాను. కీర్తి సురేష్ గారు చాలా కైండ్ హార్ట్. ఇందులో సూరి అనే పాత్ర చేశాను. ఈ పాత్ర నేను బాగా చేశానని మీకు అనిపిస్తే దానికి కారణం కీర్తి గారు కూడా.చాలా కంఫర్ట్ బుల్ గా చుశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు. నిర్మాతలకు కృతజ్ఞతలు. దసరా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. మార్చి 30న థియేటర్ లో రచ్చరచ్చగా వుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.


 


అవినాష్ కొల్లా మాట్లాడుతూ : నా కెరీర్ లో పేరు తెచ్చిన సినిమాలన్నీ నాని గారితో చేసినవే. నిర్మాత సుధాకర్ గారు భారీ స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. అందరూ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. శ్రీకాంత్ ఈ కథ చెబుతున్నప్పుడు బలంగా నమ్మాను. దసరా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు   


 


కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ..  ఇందులో ధూమ్ ధాం, చమ్కీల అంగీలేసి పాటలు రాశాను. పాటలని ఎంతో పెద్ద హిట్ చేశారు.  ఈ పాటలు ఇంత అందంగా రావడానికి కారణం సంతోష్ నారాయణ్. చమ్కీల అంగీలేసిన రీల్స్ చేసిన అందరికీ థాంక్స్. దర్శకుడు శ్రీకాంత్ ఎక్కడా తడబాటు లేకుండా ఎంతో అనుభవం వున్న దర్శకుడిలా సినిమా చేశారు. సినిమాలో అద్భుతం అనుకునే సీన్స్ చాలా వుంటాయి. నాని గారు పడిన కష్టం తెరపై చూశారు. నేచురల్ స్టార్ నట విశ్వరూపం దసరాలో చూడబోతున్నారు. నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. 30న థియేటర్స్ లో దసరా చూద్దాం’’ తెలిపారు. 


 


తోట శ్రీనివాస్ : శ్రీకాంత్ నేను మంచి స్నేహితులం. చాలా డీప్ రూటేడ్ కథ ఇది. దీనికి నేను ఒక వెర్షన్ కి డైలాగ్స్  రాయగలను గానీ మొత్తం రాయలేనని చెప్పాను. నువ్వు వుండు అన్నా నేను అంతా చూసుకుంటాను అన్నాడు. అలా తనే మొత్తం చూసుకున్నాడు. మేము కథని వంద శాతం అనుకుంటే నాని గారు కీర్తి గారు వెయ్యి శాతం చేశారు. ఈ కథ సినిమా పాత్రలు ప్రేక్షకులని వెంటాడుతాయి. 


 


ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ .. నాని గారు యాక్షన్ సీన్స్ అల్టిమేట్ గా చేశారు. కుమ్మెశారు. థియేటర్ లో మస్త్ ఎంజాయ్ చేశారు. నిర్మాతలు ఏది కావాలన్నా సమకూర్చారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఎకే 47 గన్ లాంటి కెమరా వాడం. అల్టిమేట్ గా వుంటుంది. ఈ సినిమా అందరూ అద్భుతంగా చేశారు. 30న కుమ్మేద్దాం’’ అన్నారు. ఈ ఈవెంట్ దసరా గ్యాంగ్ తో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.


Share this article :