Home » » Bhaga Bhaga Raghalara Song From Rudrudu Launched

Bhaga Bhaga Raghalara Song From Rudrudu Launched

 రాఘవ లారెన్స్, కతిరేశన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి - పిక్సెల్ స్టూడియోస్ ‘రుద్రుడు’ నుండి భగ భగ రగలరా పాట విడుదల



యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ రోజు రుద్రుడు నుంచి భగ భగ రగలరా పాటని విడుదల చేశారు.

జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని రుద్రుడు టైటిల్, పాత్రకు జస్టిఫికేషన్ గా చాలా పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  రుద్రుడిగా లారెన్స్ ప్రజన్స్ పూనకాలు తెప్పించగా.. పృధ్వీ చంద్ర ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు.

లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.


ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివ-విక్కీ.

రుద్రుడు ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరుల

సాంకేతిక విభాగం:


దర్శకత్వం - కతిరేశన్


నిర్మాత- కతిరేశన్


బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి


సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్


డీవోపీ: ఆర్ డి రాజశేఖర్ ISC


ఎడిటర్: ఆంథోనీ


స్టంట్స్: శివ - విక్కీ


పీఆర్వో -వంశీ శేఖర్


Share this article :