Home » » Rudrudu First Single Paadatha Patellam From February 11th

Rudrudu First Single Paadatha Patellam From February 11th

 రాఘవ లారెన్స్, కతిరేసన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ‘రుద్రుడు’ ఫస్ట్ సింగిల్ ‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల 



మల్టీ ట్యాలెంటెడ్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'రుద్రుడు' ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 'ఈవిల్ ఈజ్ నా బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 


తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్  ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. రుద్రుడు ఫస్ట్ సింగల్ ‘‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నారు. వీర తిరుమగన్(1962)  చిత్రంలో ‘‘పాడాద పాటెలం’ పాట క్లాసిక్ హిట్ గా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాయించకుంది. ఇప్పుడా క్లాసిక్ సాంగ్ ని రుద్రుడులో ట్రెండీ, ఫుట్ ట్యాపింగ్ రీమిక్స్ గా ప్రజంట్ చేస్తుండటం ఆసక్తిపెంచింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా..  రాకేందు మౌళి ఈ పాటకు సాహిత్యం సమకూరుస్తున్నారు.   


ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.

 

ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.


రుద్రుడు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. 


తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు


సాంకేతిక విభాగం:

నిర్మాత, దర్శకత్వం - కతిరేశన్, 

బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి

ఎడిటర్: ఆంథోనీ

స్టంట్స్: శివ – విక్కీ

పీఆర్వో: వంశీ-శేఖర్


Share this article :