Home » » Michael Pre Release Event Held Grandly

Michael Pre Release Event Held Grandly

‘మైఖేల్’ మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది. ‘శివ’ లాంటి కొత్త ఒరవడి సృష్టిస్తుందని నమ్ముతున్నాను: మైఖేల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని



‘మైఖేల్’ కి సర్వస్వం పెట్టాను. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే ఇంకా అద్భుతంగా పని చేస్తాను: సందీప్ కిషన్


మైఖేల్ యూనివర్సల్ సబ్జెక్ట్. సందీప్ గారికి ఇది బిగ్గెస్ట్ సినిమా. దేశంలో దాదాపు 1500 థియేటర్స్ లో భారీ విడుదల చేస్తున్నాం: నిర్మాతలు



హీరో సందీప్ కిషన్ రొమాంటిక్ యాక్షన్-ప్యాక్డ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘’మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా  నిర్మించాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్  గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరైన మైఖేల్ ప్రీరిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.


నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. మైఖేల్ టీజర్, ట్రైలర్, విజువల్స్, పెర్ఫార్మెన్స్ లు చూస్తుంటే కొత్త ఒరవడి మొదలౌతుందనిపిస్తుంది. చాలా సంవత్సరాలకి ఒక సినిమా కొత్తగా కనిపిస్తుంది. ‘శివ’ వచ్చినప్పుడు మిగతా సినిమాలతో కొత్తగా అనిపించింది. అలాంటి సినిమా మైఖేల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూపిన ఎనర్జీ సినిమాలో వుంటే అందరూ భుజాన తీసుకొని మోస్తారు. అందులో డౌట్ లేదు. సునీల్ గారు మోహన్ గారు భరత్ గారు చాలా ప్యాషన్ గల నిర్మాతలు. మైఖేల్ మైల్ స్టోన్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టం, ప్రతిభ, అదృష్టం ఈ మూడు కలిసొస్తే చాలా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. సందీప్ లో కష్టం, ప్రతిభ నిరంతరం కనిపించింది. అదృష్టం కనిపించలేదు. మైఖేల్ తో అది మొదలౌతుందని నమ్ముతున్నాను. మైఖేల్ సందీప్ కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. తన కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను. దివ్యాంశ చాలా అందంగా కనిపిస్తోంది. దర్శకుడు రంజిత్ చాలా కొత్తగా తీశారు. కౌశిక్ చాలా మంచి టోన్ ఇచ్చారు. వరుణ్ కి మైఖేల్ లో సరైన క్యారెక్టర్ పడింది. ఇక్కడి నుండి యాక్టర్ వరుణ్ సందేశ్ ని చూస్తామని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 3 మైఖేల్ ని థియేటర్స్ లో చూసి టీంని బ్లెస్ చేసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’


సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాని, నేను కెరీర్ బిగినింగ్ నుంచి స్నేహితులం. కానీ సినిమా వేడుకకు  నాని రావడం ఇదే తొలి సారి. మైఖేల్ నాకు స్పెషల్ మూవీ కావడం, ఈ వేడుకకు నాని రావడం మరింత స్పెషల్ అయ్యింది. దసరా టీజర్ చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను. నాని నిరంతరం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాడు. ప్రీరిలీజ్ వేడుక అంటే కొంచెం టెన్షన్ గా వుంటుంది. కానీ మైఖేల్ సినిమాకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టేశాను. నాకు బిగ్గెస్ట్ ప్రైడ్ లోకేష్ కనకరాజ్. నాకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ రంజిత్ జయకోడి. నేను ఏదైతే చేయలేనని అనుకున్నారో అన్నీ సినిమాలో చేశాను. భరత్ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. పుష్కర్ రాం మోహన్ రావు గారు, సునీల్ గారికీ కృతజ్ఞతలు. సమ సిఎస్ మైఖేల్ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిరణ్ కౌశిక్ చాలా బ్రిలియంట్ డీవోపీ చేశారు. ఇది ఆయన మొదటిన్ సినిమా అంటే ఎవరూ నమ్మరు. విజయ్ సేతుపతి గారికి ఎన్ని థాంక్స్ చెప్పిన సరిపోదు. ఈ సినిమాపై ఆయన ఎంతో ప్రేమ చూపించారు. ఆ ప్రేమ తెరపై కనిపిస్తుంది. దివ్యాంశ అమెజింగ్ కోస్టార్.  అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా చాలా మంచి రోల్ చేశారు. గౌతం మీనన్ మా గురువు గారు. ఆయన ఈ సినిమాలో చేయడం చాలా స్పెషల్. అలాగే అనసూయ కూడా చాలా మంచి పాత్ర చేశారు. ట్రైలర్ కి టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా బ్లడ్ మొత్తం పెట్టి ఈ సినిమా చేశానని చాలా మంది చెప్పారు. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రేమ చూపిస్తూ వుండటం..ఇంకా అద్భుతంగా పని చేస్తాను’’ అన్నారు.


దర్శకుడు రంజిత్ జయకోడి మాట్లాడుతూ.. ముందుగా నిర్మాతలకు కృతజ్ఞతలు. భరత్ గారు ఎంతో గొప్పగా చూసుకున్నారు. మొదట ఈ కథ మోహన్ గారికి చెప్పాను. అద్భుతంగా వుందని చెప్పారు. తర్వాత ఎప్పుడూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. సునీల్ గారు చాలా స్వీట్. మై హీరో సందీప్ .. మై బ్రదర్. లవ్ యూ సందీప్. ఇందులో భాగమైన నా స్నేహితుడు విజయ్ సేతుపతికి బిగ్ థాంక్స్. వరుణ్ సందేశ్ తన నటనతో ఆశ్చర్యపరిచారు. సామ్ సిఎస్, కిరణ్ కౌశిక్ వండర్ పుల్ వర్క్ ఇచ్చారు ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. ’’ తెలిపారు.


వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సందీప్ మైఖేల్ కోసం ప్రాణం పెట్టి పని చేశాడు. ఎన్ని గాయాలు తగిలిన లెక్క చేయలేదు. ఈ సినిమా సందీప్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు సునీల్ గారు, భరత్ గారు , మోహన్ గారి ప్రొడక్షన్ లో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. నా కెరీర్ లో ఇలాంటి పాత్రని ఎప్పుడూ చేయలేదు. కొత్తగా కనిపించబోతున్నాను. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. రంజిత్ చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాని దసరా కి కూడా ఆల్ ది బెస్ట్ ’’ తెలిపారు.


దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. సందీప్ కిషన్ గారు ఎంతో హార్డ్ వర్క్, డెడికేషన్ తో మైఖేల్ చేశారు. రంజిత్ అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా నిర్మాతలతో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరూ మైఖేల్ ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నారు.


నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ.. సందీప్ గారు పడిన కష్టం ట్రైలర్ లో చూశారు. రేపు బిగ్ స్క్రీన్స్ లో చూసి అందరం ఆనందాన్ని పంచుకుందాం. అలాగే దర్శకుడు రంజిత్ కి సినిమా తప్పా వేరే ప్రపంచం లేదు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. పాన్ ఇండియాలో భారీగా విడుదల చేస్తున్నాం. విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంశ, గౌతమ్ మీనన్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. డీవోపీ, మ్యూజిక్, యాక్షన్, విజువల్స్ అన్నీ నెక్స్ట్ లెవల్ వుంటాయి. సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. దసరాతో వస్తున్న నాని గారికి శుభాకాంక్షలు’’ తెలిపారు.


నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ.. రంజిత్ ఈ కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. కథ ఎలా అయితే అద్భుతంగా చెప్పారో అంతకంటే అద్భుతంగా సినిమా తీశారు. మైఖేల్ చూసి సర్ ప్రైజ్ అయ్యాం. నిర్మాతలుగా చాలా హ్యాపీగా వున్నాం. సందీప్ గారికి ఇది బిగ్గెస్ట్ సినిమా. దేశంలో 1500 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. హిందీలో దాదాపు 500 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు


అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. సందీప్ గారు ఈ సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాలి. ఈ సినిమా నిర్మాతలు సునీల్ గారు, మోహన్ గారు , భరత్ గారు నా సోదరులు లాంటి వారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు  


అనిల్ సుంకర మాట్లాడుతూ.. మైఖేల్ సందీప్ కెరీర్ లోనె బెస్ట్ ఓపెనింగ్స్ అనేది ఖరారైయింది. ఈ సినిమాతో సందీప్ టాప్ లీగ్ లోకి వెళ్తాడు. మైఖేల్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ చెప్పారు


టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మైఖేల్ ట్రైలర్ లో సందీప్ హార్డ్ వర్క్ కనిపించింది. కష్టాని తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. మైఖేల్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ‘’ చెప్పారు.


వివేక్ మాట్లాడుతూ.. సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, నిర్మాతలు చాలా కావాల్సిన వారు. మైఖేల్ పెద్ద విజయం సాధించాలి’’అని కోరారు.


ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ.. సందీప్ ఈ సినిమా గురించి చెబుతూ వేరే లెవల్ అన్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత సందీప్ మాటలని నమ్ముతునాను. మైఖేల్ లో కనిపిస్తున్న సందీప్ లుక్ కావాలని పదేళ్ళుగా అడుగుతూనే వున్న. చివరికి ఆ క్రెడిట్ దర్శకుడు రంజిత్ కి దక్కింది.  చాలా అద్భుతంగా తీశాడు. యాక్షన్ తో పాటు రోమాన్స్ వుంది. వరుణ్ సందీప్ పాత్రని కూడా ఊహించలేకపోయా. డీవోపీ కిరణ్ ని చూస్తే జెలసీగా వుంది. అంత అద్భుతంగా తీశాడు. నిర్మాతలు సునీల్, భరత్, మోహన్ నాకు ఎంతో మంచి స్నేహితులు. మైఖేల్ పట్ల చాలా హ్యాపీగా వున్నారు. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లడుతున్నా’’ అన్నారు


నందిని రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది క్రితం మైఖేల్ కథని సందీప్ ఎంతో ప్రేమతో చెప్పాడు. ఇంత పిచ్చిగా ఒక కథ గురించి సందీప్ మాట్లాడటం మైఖేల్ కే జరిగింది. ట్రైలర్ చూసినప్పుడు సందీప్ అంత ప్రేమతో ఆ కథని ఎందుకు చెప్పారో అర్ధమైయింది. మైఖేల్ మ్యాజిక్ ని తెరపై చూడటానికి మేము అంతా సిద్దంగా వున్నాం. మైఖేల్ ఖచితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.


కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ సినిమాకి మాటల రచయిత కావడం చాలా ఆనందంగా వుంది. మాటల రచయితగా ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత భరత్ చౌదరి గారికి కృతజ్ఞతలు. లవ్, యాక్షన్ లో హైఇంటెన్స్ ఉన్న చిత్రమిది. మైఖేల్ అద్భుతమైన కథ. సందీప్ కిషన్ గారికి, రంజిత్ గారికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న మాటల తూటాలు పేలబోతున్నాయి’’ అన్నారు.


సాయి రాజేష్ మాట్లాడుతూ.. సందీప్ కిషన్ ఎంతో మందికి సపోర్ట్ గా నిలిచారు. ప్రతిభ ఎక్కడ వున్న ప్రోత్సహిస్తారు. మైఖేల్ ట్రైలర్ చూస్తుంటే క్లాసిక్ వైబ్స్ కలుగుతున్నాయి. ఖచ్చితంగా వండర్ జరుగబోతుందనే ఫీలింగ్ వుంది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు  


వి ఐ ఆనంద్ మాట్లాడుతూ.. ‘టైగర్’ సినిమా నాకు ఒక గుర్తింపుతో పాటు సందీప్ కిషన్ అనే మంచి ఫ్రండ్  ఇచ్చింది. సందీప్ చాలా గొప్ప విజయాలు అందుకోవాలి. నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలి. మైఖేల్ సందీప్ కిషన్ కి గేమ్ చెంజర్ అవుతుంది. ’’ అన్నారు .


డీవోపీ కిరణ్ కౌశిక్ మాట్లాడుతూ.. మైఖేల్ అద్బుతమైన కథ. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాం. చాలా మంచి యాక్షన్ వుంది. సందీప్ గారు ఎక్స్ టార్డినరీగా చేశారు. సినిమా మీ అందరిని అలరిస్తుంది.


ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ మాట్లాడుతూ.. సందీప్ గారు, రంజిత్ గారు, నిర్మాతలు.. ఇలా అందరం చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు  ఖచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు.



Share this article :