Home » » TTD Board Member Dasari Kiran Has been Felicitated in Tenali

TTD Board Member Dasari Kiran Has been Felicitated in Tenali


ఆజన్మాంతం వారిద్దరికి రుణపడి ఉంటాను– టిటిడి బోర్డు మెంబర్‌ దాసరి కిరణ్‌


ఓ సామాన్యుడు అసమాన్యమైన టిటిడి బోర్డు మెంబర్‌గా సేవ చేసుకునే అవకాశాన్ని ఎలా దక్కించుకున్నాడు? చిన్న వయసుల్లోనే దేవుని సన్నిధిలోకి ఎలా ఎంట్రీ దొరికింది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది.  దాసరి కిరణ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుమెంబర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. దాసరి కిరణ్‌ మాట్లాడుతూ–‘‘  2005 నుండి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది అన్నారు దాసరి కిరణ్‌కుమార్‌. ఆ పరిచయంతో మచిలీపట్నం  యంపీ బాలశౌరిగారిని నాకు పరిచయం చేశారు జగన్‌మోహన్‌ రెడ్డిగారు. ఆ  రోజు మొదలుకొని ఈ రోజు వరకు బాలశౌరి కుడిభుజంలా వ్యవహరిస్తూ ఉన్నాను అన్నారు కిరణ్‌కుమార్‌. వారిద్దరి పరిచయ భాగ్యమే నాకు భగవంతునికి సేవ చేసే అదృష్టం దక్కింది. వారికోసం నా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు పనిచే స్తాను. నాకు ఆ శ్రీవారి సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించిన ఆ ఇద్దరు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి, యంపి బాలశౌరి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. తెనాలి ఎమ్మెల్యే శివన్న దగ్గరుండి ఈ సన్మాన కార్యక్రమం జరపడం ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడో సభల్లో పాల్గొని సత్కారాలు పొందటం వేరు, మన సొంత గడ్డపై ఇలాంటి సత్కారాన్ని పొందటం వేరు. నా ప్రతి అడుగులో ఇక్కుడున్న వారందరూ ఏదోరకంగా వారికి చేతనైన సాయం చేయటంతో ఈ రోజున మీ ముందు ఇలా నిలుచున్నాను. మీ అందరికి పాదాభివందనాలు. శ్రీవారికి సేవ చేసుకుంటూ మీ అందరితో కలిసిమెలిసి ఉండి ఇంకా ఎంతో కష్టపడతాను అని మనస్ఫూర్తిగా చెప్తున్నా’’ అన్నారు సినీ నిర్మాత– బిజినెస్‌మెన్‌– రాజకీయవేత్త అయిన దాసరి కిరణ్‌కుమార్‌. ఆదివారం సాయంత్రం కిరణ్‌ టిటిడి బోర్డు మెంబర్‌ అయిన  సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌ అధ్యక్షతన కిరణ్‌ స్వస్థలం అయిన తెనాలిలో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా నందివెలుగు నుండి తెనాలి వరకు 2000 బైక్‌లు 270 కార్లతో ఎనిమిది కిలోమీటర్లు ర్యాలీ జరిగింది. ఈ భారీ ర్యాలీలో నందివెలుగు అడ్డరోడ్డు నుండి స్థానిక వైసిపి నాయకులు దాసరి కిరణ్‌ మిత్రమండలి సభ్యులు కుర్రా గడ్డేటి సురేంధ్ర, చెన్నకేశవులు, కిట్టు, వెంకటేశ్వర రావు, పవన్‌ల ఆధ్వర్యంలో  అతిపెద్ద క్రేన్‌సాయంతో గజమాలని  కిరణ్‌కు వేసి దాసరి కిరణ్‌పై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. క్రేన్‌తో వచ్చిన 30 అడుగుల గజమాలను అలంకరించటం ర్యాలీకి హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో వందలమంది దాసరి కిరణ్‌ని సన్మానించి కిరణ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సభలో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున, సభాధ్యక్షులు శివకుమార్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు బాపట్ల యంపి నందిగం సురేశ్‌ ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు ‘ధమాకా’ దర్శకులు నక్కిన త్రినాధరావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సభాధ్యక్షులు అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘కిరణ్‌ నాకు ఎంతో ఆప్తుడు, అందులో మా తెనాలి కుర్రోడు. తితిది బోర్డు మెంబర్‌ అయ్యాడని తెలిసి చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు మా యంఎల్‌ఏల కంటే బోర్డు మెంబర్‌ కిరణ్‌కే ఫేమ్‌ ఎక్కువ. ఎందుకంటే అందరికి తిరుమల దర్శనం టిక్కెట్లు కావాలి. అవి కిరణ్‌ చేతిలో ఉంటాయి’’ అని నవ్వుతూ అన్నారు. మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ–‘‘ కిరణ్‌ మా ఇంట్లో మనిషి. నాకు మొదటినుండి ఎంతో ఆప్తుడు. తాను గుంటూరు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుండి చక్కని స్నేహం మా మధ్యలో ఉంది’’ అన్నారు. బాపట్ల యంఎల్‌ఏ నందిగం సురేశ్‌ మాట్లాడుతూ–‘‘ కిరణ్‌ నాకు ఎంతో మంచి మిత్రుడు, అత్యంత సమర్థవంతుడు. తనకోసం ఎంతమంది వచ్చారో ఈ వేదిక చూస్తే తెలుస్తుంది. ఆయనకు శుభాకాంక్షలు’’ అన్నారు.  మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ– ‘‘ కిరణ్‌లాంటి మంచి మనిషికి దేవుని సేవ చేసుకునే అదృష్టం కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది. కిరణ్‌కి ఇప్పుడొచ్చిన ఈ అవకాశం ద్వారా నేలవిడిచి సాము చేయకుండా తన శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు బాబి మాట్లాడుతూ–‘‘ నేను చిరంజీవి అభిమానిగా ఉన్నప్పట్నుంచి దాసరి కిరణ్‌ అన్న నాకు ఎంతో పరిచయం. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా అందరికి సాయం చేయాలని ప్రయత్నిస్తుంటారాయన. ఆ మంచితనమే కిరణన్నని ఈ రోజు ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టింది’’ అన్నారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ–‘‘ నేను సినిమా పరిశ్రమకి వచ్చి దాదాపు పదిహేనేళ్లయింది. కిరణ్‌గారు పరిచయమై ఆరేళ్లయింది. అంతకుముందు ఎవరన్నా సినిమా పరిశ్రమలో నీ మనిషెవరు? బెస్ట్‌ ఫ్రెండెవరు అని అడిగితే నేను పది నిమిషాలు ఆలోచించేవాడిని. ఇప్పుడైతే దాసరి కిరణ్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అని గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సత్యారెడ్డి, రచయిత విస్సు, చిరంజీవి ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ రవణం స్వామినాయుడు తదితరులు పాల్గొని దాసరి కిరణ్‌ను ,  దాసరి కిరణ్‌ మిత్రమండలిని అభినందించారు.



Share this article :