Home » » Grandhalayam Teaser Launched

Grandhalayam Teaser Launched

సస్పెన్స్, థ్రిల్లర్ "గ్రంథాలయం" టీజర్  ను  విడుదల చేసిన నిర్మాత బెక్కం వేణు గోపాల్



వైష్ణవి శ్రీ క్రియేషన్స్ పతాకంపై విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి బోర, కాలికేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్,  డా.భద్రం, సోనియా చౌదరి నటీ నటులుగా సాయి శివన్ జంపన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న  సస్పెన్స్ థ్రిల్లర్ "గ్రంథాలయం". శరవేగంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న ఈ చిత్రం టీజర్ ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేసారు.  సందర్భంగా చిత్ర యూనిట్  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ఇంకా వీరితో  పాటు పాగల్ మూవీ డైరెక్టర్  నరేష్, తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.టీజర్ విడుదల అనంతరం 


లక్కీ మీడియా అధినేత, నిర్మాత బెక్కం వేణు గోపాల్ గారు మాట్లాడుతూ... గ్రంధాలయం సినిమా టీజర్ చాలా బాగుంది. దర్శకుడు ఇందులో సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశాడు. ఈ సినిమాను  టెక్నిషియన్స్ అందరూ చాలా  హార్డ్ వర్క్ చేసినట్లు  తెలుస్తుంది.. చిత్ర హీరో  విన్ను ను చూస్తుంటే కాంతారా సినిమాలో హీరోగా నటించిన రిషబ్  శెట్టి లా ఉన్నాడు. విన్ను కూడా అంత పెద్ద హీరో అవ్వాలి..మంచి కథను సెలెక్ట్ చేసుకొని  తీసిన చిత్ర నిర్మాతలకు అభినందనలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా  బిగ్ హిట్ అయ్యి  యూనిట్ అందరికీ  మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


సీనియర్ జర్నలిస్ట్ సినీ జోష్ రాంబాబు మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిచే  బెక్కం గారిది. లక్కీ హ్యాండ్. తను వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చే ప్రతి  సినిమా  హిట్  అవుతుంది. ఇప్పుడు తను రిలీజ్ చేసిన  "గ్రంధాలయం" సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యప్ప మాట్లాడుతూ..నేను మా బావ గారు ఈ సినిమా తీశాము. సినిమా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు మా గ్రంధాలయం సినిమా  కచ్చితంగా నచ్చుతుంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపన మాట్లాడుతూ.. మమ్మల్ని బ్లెస్స్ చేస్తూ మా సినిమా టీజర్ ను లాంచ్ చేసిన పెద్దలు బెక్కం వేణుగోపాల్ గారికి నా ధన్యవాదాలు. నాకు సినిమా చేయాలి  అనేది నా .20 ఏళ్ల కల, 12 ఏళ్ల కష్టం, 4 ఏళ్ల నిరీక్షణ ఈ రోజు ఫలించింది అని భావిస్తున్నాను..ఈ సినిమా కంటే ముందు "వైరం" సినిమా చేసాను అది సగం సినిమా పూర్తి అయ్యింది.. ఆ సినిమా షూటింగ్  పూర్తి కాక ముందే నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మేము తీసిన  "గ్రంధాలయం" 

సినిమాను సగభాగం చేవెళ్ళ లో  షూట్ చేశాము. అక్కడ వారు మాకెంతో ఫుల్ సపోర్ట్ చేశారు. నటీ నటులు, టెక్నీసియన్స్  అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో  తీసిన ఇలాంటి కథ ఇప్పటి వరకు  రాలేదు.మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


చిత్ర హీరో విన్ను మద్ది పాటి  మాట్లాడుతూ.. మా సినిమాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.. డైరెక్టర్ సాయి శివన్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు . ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు. 


చిత్ర హీరోయిన్ స్మిరిత  రాణి బోర మాట్లాడుతూ.. ప్రేక్షకులను థ్రిల్ కలిగించే  గ్రంధాలయం వంటి  సస్పెన్స్ హరర్ చిత్రంలో  నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు అన్నారు.


కమెడియన్ భద్రం మాట్లాడుతూ.. గ్రంధాలయం అంటే ఒక పుస్తకం అనుకున్నాం. కానీ టీజర్ చూస్తున్న వారికి మాత్రం పూనకం వచ్చేలా  సినిమాను దర్శకుడు చాలా బాగా తీశాడు తను ఫ్యూచర్ లో యాక్షన్ సినిమాలకు  కేరాఫ్ అడ్రస్ గా మారతాడు అని నమ్ముతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు అన్నారు.


పాగల్  మూవీ డైరెక్టర్  నరేష్  మాట్లాడుతూ..ఇండస్ట్రీ లో  డైరెక్టర్ అవ్వడమే  గొప్ప అచ్చీవ్మెంట్.. అలాంటిది ఒకే నెలలో ఈ చిత్ర దర్శకుడు రెండు సినిమాలు చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీ కి మరో  బోయపాటి  లభించారు  అనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.


నటీ నటులు:


విన్ను మద్దిపాటి, స్మిరిత  రాణి బోర,  కాలకేయ ప్రభాకర్,  సోనియా చౌదరి, అలోక్ జైన్, జ్యోతి రానా, కాశీవిశ్వనాథ్,  డా.భద్రం, మేక రామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ,  నవ్య శారద, నరేంద్ర నాయుడు.స్నేహ గప్త 


సాంకేతిక నిపుణులు :


బ్యానర్ : వైష్ణవి శ్రీ క్రియేషన్స్ 

నిర్మాత : వైష్ణవి శ్రీ

రచన-దర్శకత్వం : సాయి శివన్ జంపాన 

సినిమాటోగ్రఫీ : సామల భాస్కర్

సంగీతం : వర్ధన్

ఎడిటర్ : శేఖర్ పసుపులేటి

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : చిన్నా 

ఆర్ట్ డైరెక్టర్ : రవి కుమార్ మండ్రు 

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : అల్లం నేని అయ్యప్ప

లైన్ ప్రొడ్యూసర్: మహేష్ బాబు దొప్పలపూడి

పి.ఆర్.ఓ : లక్ష్మి నివాస్ 


Share this article :