Home » » Sahasra Entertainments Movie Launched

Sahasra Entertainments Movie Launched

 సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!



సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ  ప్రధాన పాత్రలుగా  తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. 


బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది.


సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతున్నాయి. సీట్ ఎడ్జ్ క్రైమ్  థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.



నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు

బ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్

సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్

దర్శకత్వం: బసి రెడ్డి రాన

నిర్మాత: నరేంద్ర  బుచ్చి రెడ్డిగారి

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

మ్యూజిక్: లిజో కె జోష్

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

ఆర్ట్: నిఖిల్ హాసన్

పిఆర్ఒ: శ్రీధర్


Share this article :