Home » » Ori Devuda Pre Release Event Held Grandly in Rajahmundry

Ori Devuda Pre Release Event Held Grandly in Rajahmundry

 


'ఓరి దేవుడా' చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌






యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు రాజమండ్రిలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.



రామ్ చరణ్‌ మాట్లాడుతూ.. 'పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ.. ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. పీవీపీ సంస్థ ఎప్పుడూ మంచి చిత్రాలను నిర్మిస్తుంటుంది. అశ్వత్ గారి ఒరిజినల్ సినిమాను చూడలేదు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మా వెంకటేష్ గారు చేసిన రోల్ చాలా ఇంపాక్ట్‌గా ఉంది. వెంకటేష్ అన్న కోసమైనా ఈ చిత్రం చూస్తాను. మిథిలా పాల్కర్‌కు నేను, నా భార్య అభిమానులం. ఆమె ఓటీటీ సూపర్ స్టార్. ఆశాకు ఆల్ ది బెస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో విశ్వక్ సేనుడి గురించి తెలియని వారులేరు. ఆయనకు అంతటా అభిమానులున్నారు. యూత్, రెబల్,రేజింగ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆయన బయట ఉండే పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని. ఇచ్చిన మాట కోసం నిలబడే వారంటే నాకు ఇష్టం. మంచో చెడో.. మాట ఇస్తే.. విశ్వక్ సేన్ నిలబడతాడు. నమ్మినదాని కోసం నిలబడం, పక్క వారి కోసం నిలబడటం పెద్ద అచ్చీవ్‌మెంట్. రజినీకాంత్, పవన్ కళ్యాణ్‌, చిరంజీవిల సినిమాలు హిట్ అవుతాయ్.. ఫ్లాప్ అవుతాయి. కానీ ఎల్లప్పుడూ సూపర్ స్టార్‌గా ఉండాలంటే.. పర్సనాలిటీ నిండుగా ఉంది. అలానే ఉండనివ్వు. ఈ చిత్రం అక్టోబర్ 21న రాబోతోంది. ఈ దీపావళికి ఈ సినిమా బాగుంటుందా?ఈ సినిమా వల్ల దీపావళి బాగుంటుందా? నాకు తెలియదు గానీ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలి. నేను మాత్రం ఈ సినిమాను చూస్తాను. మంచి ఫీల్ ఉన్న చిత్రం. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాజమండ్రికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫంక్షన్ ఇక్కడ జరుగుతోంది. రంగస్థలం సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఉప్పెన ఫంక్షన్ పెట్టారు. అది వంద కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'నమస్తే రాజమండ్రి.. ఓరి దేవుడా..  ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్. మీ జర్నీతో మేం ఎంతో ఇన్‌స్పైరింగ్. అంత పెద్ద బ్యాగేజీ, మెగాస్టార్ కొడుగ్గా పుట్టి.. ఈ స్థాయి వరకు రావాడం మామూలు విషయం కాదు. రామ్ చరణ్‌లా ఎంతో క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాను. ఇది నా లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటాను. ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్ అన్నా. ఫలక్‌నుమా దాస్ సినిమా కోసం నాని వచ్చాడు. ఆ సినిమా ట్రైలర్‌ను వెంకటేష్ గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో దేవుడి పాత్రను చేశారు. సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. మళ్లీ సక్సెస్ మీట్ పెడతాం. అప్పుడుమాట్లాడతాను. అశ్వత్ అద్భుతమైన కథ రాశాడు. ఇండియాలో టాప్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరూ ఇంకో రేంజ్‌లోకి వెళ్తారు. మిథిలా పార్కర్, ఆశా అందరితో పని చేయడం ఆనందంగా ఉంది. వంశీ కాక గారు ఇంకా మున్ముందు ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలి. నేను డైలామాలో ఉన్న సమయంలో నన్ను కూర్చోబెట్టి నచ్చజెప్పి నాతో సినిమా చేయించిన పీవీపీ గారికి థాంక్స్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రం దీపావళి కంటే ముందే వస్తోంది. రిపీట్ ఆడియెన్స్ ఉంటారు. షూటింగ్ ఉండీ కూడా మాకోసం వచ్చిన రామ్ చరణ్‌ అన్నకు థాంక్స్' అని అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక మాట్లాడుతూ.. 'కరోనా సమయంలో బతికి ఉంటే చాలు అనుకునే స్థాయికి వచ్చాం. 2020 మేలో నా హీరో రామ్ చరణ్‌ ఫోన్ చేశారు. ఎలా ఉన్నావ్.. ఫ్యామిలీ అంతా ఎలా ఉంది.. ఏమైనా హెల్ప్ కావాలా? ఈరోజే కాదు.. ఏరోజు ఏం కావాలన్నా అడుగు.. ఫస్ట్ కాల్ నాకే చేయ్ అని అన్నారు. పీవీపీ గారు ఈ సినిమాను నిర్మించారు. మా సినిమాలో ఓ దేవుడున్నారు. అడగడంతోనే వెంకటేష్‌ గారు వచ్చి చేశారు. సినిమా మొత్తం అయిపోయింది. ఎన్నో సినిమాలకు పీఆర్వోగా చేశాను. సినిమా అంతా చేసి ప్రమోషన్స్ కోసం మా చేతికి ఇచ్చేవారు. అప్పుడు నొప్పి తెలిసేది కాదు. కానీ ఈ సినిమా ప్రొడక్షన్ దగ్గరి నుంచి చూశాను. సినిమా రెడీ అయింది. ఈవెంట్‌కు నా హీరోని పిలవాలి. మూడ్రోజుల క్రితం రాజమండ్రికి వచ్చాను. సాయం చేసిన వాడు దేవుడు. మా ఓరి దేవుడా సినిమాకు గెస్ట్‌గా వచ్చాడు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా దేవుడు రామ్ చరణ్‌ గారికి చాలా థాంక్స్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.


డైరెక్టర్ అశ్వత్ మాట్లాడుతూ.. ' అందరికీ నమస్కారం. మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీరు ఇలా ఇక్కడకు రావడం మాకు ఆనందంగా ఉంది. నా కల నెరవేరినట్టుంది. మీరు రావడంతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. పక్కా ఎంటర్టైనర్ చిత్రమిది. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ప్రాణం పెట్టి నటించేశాడు. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. మిథిలా, ఆశా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ ఇలా నా టీం అంతా అద్భుతంగా పని చేసింది. నన్ను తెలుగు వారికి పరిచయం చేస్తోన్న పీవీపీ, వంశీ కాక గారికి థాంక్స్' అని అన్నారు.


మిథిలా పార్కర్ మాట్లాడుతూ.. 'ఓరి దేవుడా అనేది నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా ద్వారా మీ అందరి ప్రేమ నాకు దొరికింది. అశ్వత్ గురించి నేను ఎంతో చెప్పాలి. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ థాంక్స్. అందరూ ఈ సినిమాను థియేటర్లో చూడండి' అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ లియో జేమ్స్ మాట్లాడుతూ.. 'పాటలకు వస్తున్న స్పందన చూసి చాలా సంతోషంగా అనిపిస్తోంది. మీరు ఇంత ప్రేమ చూపించడం ఆనందంగా ఉంది. థియేటర్లో మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అక్టోబర్ 21న అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడండి' అని అన్నారు.


కెమెరామెన్ విధు అయ్యన మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి తెలుగు చిత్రం. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. అక్టోబర్ 21న అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన విశ్వక్ సేన్, మిథిలా, ఆశా భట్, డైరెక్టర్ ఇలా అందరికీ థాంక్స్' అని అన్నారు.


Share this article :