Home » » Bomma Blockbuster Trailer Launched

Bomma Blockbuster Trailer Launched

 బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌" ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు  మారుతి, డి. జె. టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి గౌతమ్ హీరోయిన్ గా  రాజ్ విరాట్ ను దర్శకుడు గా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన  చిత్రం 'బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌'. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో..ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న వచ్చింది. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక‌ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన పాటలు మంచి విజ‌యాన్ని సాధించాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా  చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు  మారుతి, డి. జె. టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ చేతులమీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిధిగా  వచ్చిన  దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత  ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారు. దాంతో  విరాట్ కు పిలిచి నెక్స్ట్ మా బ్యానర్లో సినిమా చేయమని చెప్పాను.ట్రైలర్ లో చూసిన దానికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా మొత్తం ప్రామిసింగ్ గా ఉంటుంది. ఎప్పటినుంచో కష్టపడుతున్న నందుకు తనకు ఈ సినిమా మంచి టేకాఫ్ ఇస్తుంది.రష్మిక కూడా ఈ సినిమాతో మంచి హీరోయిన్ అవుతుంది.మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి మైలేజ్ వస్తుంది.అన్నారు నిర్మాత ఎస్ కే యన్ మాట్లాడుతూ..  మంచి కథను సెలెక్ట్ చేసుకుని  బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ తో తెరకేక్కించిన విరాట్ ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చే వారికి, రాబోయే జనరేషన్ కి మూలవిరాట్ నిలబడాలని కోరుతున్నాను. అలాగే ఈ సినిమాతో ప్రేక్షకులకు నందు మంచి విందు పెడతాని కోరుకుంటున్నాను. రష్మిక గౌతమ్ ఈ సినిమాతో పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుతున్నాను.సినిమాలో పాటలు  చాలా బాగున్నాయి. ప్రేక్షకులలో ఈ పాటలు చార్ట్ బస్టర్ నిలవాలని కోరుతూ నిర్మాతలు చాలా ప్యాషన్తో  విజయీభవ ఆర్ట్ పై తీసిన  ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా "బొమ్మ బ్లాక్ బస్టర్" కావాలని కోరుతున్నాను అన్నారు.హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..డీజే టిల్లు పార్ట్ 2  రాసే క్రమంలో బిజీగా ఉన్నా నందు, రష్మీల కోసం  వచ్చాను. నేను, నందు, విశ్వక్, రష్మీ అందరం టెన్ ఇయర్స్ బ్యాక్ కలిసి కేరీర్ స్టార్ట్ చేశాము.అప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే రష్మి నా ఫస్ట్ కో స్టార్ కూడా.. డైరెక్టర్ విరాట్ ఇంతకుముందు తీసిన షార్ట్ ఫిలిమ్ కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకున్నాడు. అలాగే ఈ సినిమా కంటెంట్ లో ఏదో చాలా క్రేజీనెస్ ఉంది. అలాగే సిద్ధూ ఇచ్చిన విజువల్స్ చాలా బాగున్నాయి మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..ఈ సినిమాను నేను,ప్రవీణ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఇలా నలుగురు కలిసి ఈ సినిమా తీస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క మూవీ తీయకుండా అందరు కలిసి సినిమా తీశాము. అయితే మా కానీ ఫస్ట్ మూవే హిట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నందు గారు రష్మి గారు చాలా బాగా చేశారు. రష్మీ గారు వైజాగ్ దగ్గర చిన్న పల్లెటూరు లో ఈ సినిమా షూట్ చేశాము.ఆ గ్రామంలో ఏ ఫెసిలిటీస్ లేకున్నా కూడా నందు, రష్మీ లు టెక్నీషియన్,  ఆర్టిస్ట్ లు, ఆఫీస్ బాయ్ లతో  కలసి  పనిచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ సినిమా కోసం వారు ప్రాణం పెట్టి పని చేశారు.ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే  దానికి ప్రధాన కారణం నందు, రష్మిక,  డైరెక్టర్,  ఆర్టిస్టులు ఇలా అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా ఇంత బాగా వచ్చింది. దర్శకుడు విరాట్ మేకింగ్ చాలా బాగుంది, ఈ సినిమాకు ప్రశాంత్ మేము అనుకున్న దాని కంటే 100 రెట్లు మ్యూజిక్ ఇచ్చాడు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.చిత్ర హీరో నందు మాట్లాడుతూ..ఏ బ్యాక్గ్రౌండ్ లేని నాకు సవారీ సినిమాకు ప్రేక్షకులందరూ బ్యాక్గ్రౌండ్ గా నిలిచి నాకు సపోర్ట్ చేశారు.ఈ సినిమా కొరకు రష్మీ దగ్గరికెళ్ళి చెప్పడంతో నన్ను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది. అచ్యుతాపురం అనే చిన్న ఊర్లో షూట్ చేస్తున్నప్పుడు   ఇల్లు కూడా లేని ఆ ఊర్లో రష్మిక  పూరిగుడిసెలో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునేది. సినిమా కోసం  తను చాలా ఇబ్బంది పడింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు.ఈ సినిమా తో పాటు  పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా 25% షూట్ అయిపోయిన తర్వాత సినిమాని ఇలా కాదు నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లాలని  అనుకున్న బడ్జెట్ కంటే భారీ స్థాయిలో తీసుకొచ్చిన విజయీభవ ఆర్ట్స్ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ గార్లకు ధన్యవాదాలు అన్నారు.హీరోయిన్ రష్మిక గౌతమ్ మాట్లాడుతూ..రాజ్ కిరీటి చెప్పిన కథను నమ్మి నందు వచ్చి నాకు  ఈ సినిమా కథ చెప్పడం జరిగింది.తనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.అయితే 25% షూట్ అయిన తరువాత విజయీభవ ఆర్ట్స్ వారు వచ్చి అప్పటివరకు తీసిన కంటెంట్ నచ్చి విరాట్ మీద నమ్మకంతో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు.విరాట్ గారు నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి  బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రాయే రాయే నా పాట నా ఫేవరెట్ సాంగ్ మంచి కథతో వస్తున్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.చిత్ర దర్శకుడు రాజ్ కిరీటి  మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో.. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న వచ్చింది.  మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారి మాట్లాడుతూ.. ఇందులో పాటలు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన  దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.
న‌టీన‌టులు


నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్, కిరిటి, ర‌ఘు కుంచె త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


రచన – దర్శకత్వం : రాజ్ విరాట్

నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ

మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి

పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే

ఎడిటర్ : బి. సుభాష్కర్

సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్

పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్


Share this article :