Home » » A Beautiful Girl Teaser Launched

A Beautiful Girl Teaser Launched

 ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “ టీజర్ ను లాంచ్ చేసిన హీరో అడవి శేష్ 
బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్  నటీ నటులుగా, రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం  ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “.ఈ చిత్రానికి సహ నిర్మాతలు గా అనిల్, క్రాంతి జువ్వల, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహన్ దాస్ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన సందర్బంగా    హీరో అడవి శేష్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం ఈ చిత్ర టీజర్ ను  విడుదల చేశారు.


గిడియన్ కట్టా కొట్టిన తాజాగా ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విడుదలైన ఈ టీజర్ ను గమనిస్తే, మరియు ఇప్పటి వరకు నేను ఎన్నో, మిస్సింగ్ కేసెస్,రేప్ కేసెస్ & మర్డర్ కేసెస్ లను చూశాను కానీ ఇది చాలా టిఫికల్ కేస్ అని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న నటుడు మధునందన్ చెప్పే డైలాగ్ తో ఇదొక మర్డర్ మిస్ట్రీ కథ అనిపిస్తుంది. గతంలో చాలా మర్డర్ మిస్ట్రీ కథలు వచ్చినప్పటికీ.. ఇందులో కేవలం క్రైమ్‌ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్‌, డ్రామా, సెంటిమెంట్‌, క్రైమ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన కథను దర్శకుడు ఎంచుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో స్మార్ట్ గా కనిపించిన కొత్త అబ్బాయ్ సమర్థ హీరో నా విల్లన్ ఆ అర్థం కావట్లేదు టీజర్ చూస్తుంటే, ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే  హీరో  నిహాల్ కోదాటిని అరెస్ట్ చేయడం, మరియు నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్ ల రొమాంటిక్  సీన్స్ మరియు న్యూస్ పేపర్ లో 'మోస్ట్ టెర్రీఫయింగ్ కేస్' అనే హెడ్ లైన్ చూస్తుంటే అందరిలో ఈ కథపై ఎంతో ఇంట్రెస్ట్ ను, క్యూరియాసిటీని క్రీయేట్  చేస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి ప్రతిభ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. అద్భుతమైన విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాకు అర్వీజ్  సాంగ్స్ అందించారు, నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అమర్ దీప్,ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో  ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాబావాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక, నిర్మాతలు.నటీ నటులు


నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు


సాంకేతిక నిపుణులు 


నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు

సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల

ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సాదునూరు

స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి

డి. ఓ. పి : అమర్ దీప్

ఎక్సగ్యూషన్ లీడ్ : పాంచజన్య పోతరాజు

క్రియేటివ్ హెడ్ : కృష్ణ చైతన్య పసుపులేటి

ఆర్ట్ : విజయ్ మక్కెన

మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : గిడియన్ కట్ట

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి

ప్రొడక్షన్ హెడ్ : అరవింద్ కుమార్ పిట్టల

డబ్బింగ్ & డి ఐ : జయంతి స్టూడియో

సౌండ్ ఎఫెక్ట్స్ : నాగ కిరణ్

వి ఎఫెక్ట్స్ : ప్రైమ్ పిక్సెల్

డాల్బీ మిక్సింగ్ : ప్రసాద్ ల్యాబ్  అట్మాస్ స్టూడియో


Share this article :