Home » » Jeevitha Rajasekhar Visited Vidya Vasula Aham (Vivaham) Sets

Jeevitha Rajasekhar Visited Vidya Vasula Aham (Vivaham) Sets

 ‘విద్య వాసుల అహం’(వివాహం) సెట్స్‌లో జీవిత, రాజశేఖర్ సందడి



రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎటర్నిటి ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతోన్న సినిమా ‘విద్య వాసుల అహం’(వివాహం). ‘తెల్లవారితే గురువారం’ సినిమా తర్వాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోను వినాయక చవితి స్పెషల్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటికి అద్భుతమైన స్పందన వచ్చింది. 


తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌‌ను శివాని రాజశేఖర్ తల్లిదండ్రులైన జీవిత, రాజశేఖర్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరుకి ఈ సినిమా కాన్సెప్ట్ కి వాళ్ళు ఎంతో సంతోషించారు. ఈ సినిమా తన కుమార్తెకే కాకుండా టీమ్ మొత్తానికి విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని, మంచి కంటెంట్‌తో వస్తున్న ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో బ్రహ్మరధం పడుతున్నారని పేర్కొన్నారు.   


పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. 


నటీనటులు:

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్


సాంకేతిక నిపుణులు:

చిత్రం: విద్య వాసుల అహం

బ్యానర్: ఎటర్నిటి ఎంటర్టైన్మెంట్

సంగీతం: కల్యాణి మాలిక్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ దత్త మోటూరు

సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి

రచన: వెంకటేష్ రౌతు

ఎడిటర్: సత్య గిడుటూరి


నిర్మాత: లక్ష్మీ నవ్య మోటూరు  & రంజిత్ కుమార్ కొడాలి

దర్శకత్వం: మణికాంత్ గెల్లి


Share this article :