Home » » Akashavani Vishakapattana Kendram First Song Launched

Akashavani Vishakapattana Kendram First Song Launched

పాన్ ఇండియా మూవీగా ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’ ... తొలి పాట విడుదల



శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన  హీరోహీరోయిన్లుగా మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో  సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’. జ‌బ‌ర్దస్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఎం.ఎం. అర్జున్‌ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్నఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ , హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్నారు. కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాట‌ను చిత్ర యూనిట్ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా...


నిర్మాత ఎం.ఎం.అర్జున్ మాట్లాడుతూ ‘‘సతీష్‌ క‌థ చెప్పగానే బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చ‌క్కగా తెర‌కెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించ‌డంలో నిర్మాత‌గా నా వంతు బాధ్యత‌ను స‌మ‌ర్ధవంతంగా నిర్వర్తించాను. హీరోహీరోయిన్లు శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన  చ‌క్కగా న‌టించారు. యూనివర్సల్ పాయింట్ కావటంతో సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాట‌ను విడుద‌ల చేస్తున్నాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’’ అని అన్నారు.


ఇక దర్శకుడు సతీష్ బత్తుల మాట్లాడుతూ ‘‘‘ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్టణ కేంద్రం’ చిత్రం డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మ‌ల్లికార్జున్‌గారి స‌పోర్ట్ లేక‌పోతే ఇంత దూరం రాగ‌లిగే వాళ్లం కాదు. మేకింగ్‌లో మ‌ల్లికార్జున్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పాన్ ఇండియా మూవీగా సినిమా రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది. శివ‌, ఉమ‌య‌, దేవీప్రసాద్‌, మాధ‌వీల‌త ఇలా మంచి ఆర్టిస్టులు.. కార్తీక్ మ్యూజిక్‌, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ ఇలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది’’ అన్నారు.


న‌టీన‌టులు:


శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన


సాంకేతిక వ‌ర్గం:


బ్యాన‌ర్స్‌:  మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి,  సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్‌

నిర్మాత :  ఎం.ఎం.అర్జున్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  స‌తీష్ బ‌త్తుల‌

కో ప్రొడ్యూస‌ర్స్‌:  విశ్వ‌నాథ్‌.ఎం, హ‌రి కుమార్.జి, క‌మ‌ల్ మేడ‌గోని

సంగీతం :  కార్తీక్‌ కొడ‌గండ్ల‌

పి.ఆర్.ఒ:  కుమార స్వామి వంగాల‌  


Share this article :