Home » » Director Parasuram Sarkaru Vaari Paata Interview

Director Parasuram Sarkaru Vaari Paata Interview

మహేష్ బాబు గారికి సర్కారు వారి పాటతో బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది : పరశురాం ఇంటర్వ్యూ



సూపర్ స్టార్ మహేష్ బాబు  ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'.  బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటించారు. పరశురాం పంచుకున్న సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సంగతులివి.


సర్కారువారి పాట ఘన విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు గారి దగ్గర నుండి వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?


'సర్కారు వారి పాట' కథ అనుకున్నప్పుడే మహేష్ బాబు గారి కెరీర్ లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. దానికి తగ్గట్టే క్యారెక్టర్, మేనరిజమ్స్, లుక్స్ డిజైన్ చేశాం. మేము ఊహించినట్లే సినిమా ఘన విజయం సాధించింది. కొత్త మహేష్ బాబుని చూస్తున్నామనే ఫీడ్ బ్యాక్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వచ్చింది. సినిమా ఇంతపెద్ద ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. రిలీజ్ రోజు మార్నింగ్ మహేష్ బాబు గారు కాల్ చేసి.. ''అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. కంగ్రాట్స్''అని ఆయనే రివర్స్ లో కంగ్రాట్స్ చెప్పారు. నేను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డానో మహేష్ గారికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా వుంది.


ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?

దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, పూరి గారు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ''నేను అయితే ఇంతహెవీ కథని ఇంత లైటర్ వెయిన్ లో వినోదాత్మకంగా ట్రీట్ చేయలేను. ఇది నీ ఒక్కడికే సాధ్యం'' అని సుకుమార్ అన్నారు.

స్పెషల్ గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ దగ్గర నుండి భారీ స్పందన వచ్చింది. ఫ్యాన్స్  ఫోన్ చేసి'' మహేష్ బాబు గారిని ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు. అద్భుతంగా చూపించారు''అని ఆనందపడ్డారు.


ఇంత హెవీ స్టొరీని లైటర్ వెయిన్ చెప్పిసినట్లు మీకు అనిపించలేదా ?

ఒకొక్కరిది ఒక్కో స్టయిల్. థియేటర్ లోకి వచ్చిన వారిని ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడం నాకు ఇష్టమైన స్టయిల్.  ప్రేక్షకులు నవ్వాలి. ఆనందంగా వుండాలి. మనం చెప్పాలనుకున్న పాయింట్  కూడా చెప్పాలి. ఇదే నాకిష్టం. సర్కారు వారి పాటకు రిపీట్ ఆడియన్స్ రావడానికి కారణం కూడా సినిమాలో వున్న వినోదమే.


బాక్సాఫీసు నెంబర్స్ చూస్తే కిక్ వస్తుందా ? లేదా మంచి సినిమా తీశామనే కిక్కుందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం సెకండ్ కిక్. మహేష్ గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం థర్డ్ కిక్. ఇక బాక్సాఫీసు నెంబర్లు అంటే అది మహేష్ గారికి వున్న స్టార్ డమ్.. కథ జనాల్లోకి చొచ్చుకు వెళ్ళడం... రెండో వారం వస్తుంది... ఇప్పటికీ అద్భుమైన షేర్స్ లో వుంది సర్కారు వారి పాట.


సర్కారు వారి పాట కథ కంటే మహేష్ బాబు గారి క్యారెక్టర్ పైనే ఎక్కువ ద్రుష్టిపెట్టారనే విమర్శ గురించి ఏం చెప్తారు?


క్యారెక్టర్ ఎంత కొత్తగా చేసినా కథ బలంగా లేకపోతే ఒక స్టార్ హీరో ఓకే చేయరు. సర్కారు వారి పాట కథ చాలా కొత్త పాయింట్. ఇలాంటి కథతో గతంలో ఎలాంటి సినిమా రాలేదు. మహేష్ గారు ఈ కథ ఓకే చేయడానికి కారణం కథే. ప్రతి సామాన్యుడు కష్టపడి బ్యాంక్ నుండి తీసుకున్న అప్పుని వడ్డీ అణాపైసాలతో సహా తిరిగి చెల్లిస్తున్నాడు. కానీ కొందరు కోట్ల రుపాయిలు తీసుకొని ఎందుకు కట్టడంలేదు .. ? ఈ అంశాన్నే హిట్ చేయాలని భావించాం. ఆ పాయింట్  వంద శాతం కన్వే అయ్యింది. కామన్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ఈ కథ మహేష్ గారికి చెప్పక ముందే చాలా మంది ప్రముఖులని కలిశాను. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ ని కూడా సంప్రదించాను.


ఈ సినిమాలో హీరో మహేష్ పాత్ర హీరోయిన్ కి  పాతిక వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. కానీ తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు  కేవలం పదివేల డాలర్లే అడుగుతాడు ? ఎందుకు అలా ?

హీరో, హీరోయిన్ కి ఇచ్చిన అప్పు పదివేల డాలర్లే. మిగతా పదిహేను వేల డాలర్లు ప్రేమలో వున్నపుడు ఇస్తాడు. ఇందులో ఎలాంటి కన్ఫ్యుజన్ లేదు.


సర్కారు వారి పాట విజయం పై సూపర్ స్టార్ కృష్ణ గారి స్పందన ఎలా అనిపించింది ?

చాలా ఆనందంగా వుంది. ఆయన్ని నేరుగా వెళ్లి కలవాలి. ఆయన బర్త్ డేకి వెళ్లి కలుస్తా.


మహేష్ బాబు గారు కర్నూల్ వేడుకలో స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది.

మహేష్ గారు ఇలా స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఆయన అలా డ్యాన్స్ చేయడం చూసి చాలా సర్ప్రైజ్ గా అనిపించింది. సర్కారు వారి పాట విజయం పట్ల మహేష్ గారు ఎంత ఆనందంగా వున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.


సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ తో చేశారు.. అంతకి ముందు జర్నీకి ఈ సినిమా జర్నీకి ఎలాంటి తేడా వుంది ?

సినిమా అనేది ఎప్పుడూ ఒక భాద్యతే. మనల్ని నమ్మి హీరో డేట్స్ ఇస్తారు, నిర్మాత డబ్బులు పెడతారు. ప్రతి సినిమాకి ఒకటే బాధ్యత. ఐతే సూపర్ స్టార్స్ తో చేసేటప్పుడు రీచబులిటీ ఎక్కువ వుంటుంది కాబట్టి  రైటింగ్, విజువల్ స్పాన్ పెంచుకోవాలి. దర్శకుడిగా ఇది నా పర్శనల్ రెస్పాన్సబిలీటీ.


స్పాన్ పెంచుకోవడం అంటే కమర్షియల్ ఫార్ములాలో వెళ్ళడమా ?

లేదండీ. సర్కారు వారి పాట కమర్షియల్ ఫార్ములా కాదు. చాలా మంది సినిమా లైటర్ వెయిన్ లో వుందని అంటున్నారు. ఫార్ములా బ్రేక్ చేయడం వలన వచ్చే ప్రశ్నలే ఇవన్నీ. ఒక హీరో జర్నీ..  తనకు ఎదురైన పరిస్థితులు, వాటి నుండి సమాజానికి ఒక మంచి విషయం ఎలా చెప్పాడనేది కథలో వుంటుంది.


ఫారిన్ లో అప్పులు, వడ్డీలు వసూలు చేసే హీరో.. ఇండియా కి వచ్చిన తర్వాత అప్పులు కట్టక్కర్లెదని చెప్పడం ఎలా సమర్ధిస్తారు?

మీరు కథని బాగా పరిశీలిస్తే అప్పులు కట్టవద్దని హీరో ఎక్కడా చెప్పడు. అందరూ కట్టాలనేదే హీరో పాయింట్.


సర్కారు వారి పాటతో పరశురాం బిగ్ స్టార్ డైరెక్టర్ లీగ్ లోకి వెళ్ళారని అంతా బావిస్తున్నారు. మీరు చేయబోయే కొత్త సినిమాలు కూడా భారీగా వుండబోతున్నాయా ?  

దేనికైనా కథ కుదరాలి. మహేష్ బాబు గారు ఈ సినిమా చేసారంటే కారణం కథే కదా. అందుకే ముందు కథపైనే ద్రుష్టి పెట్టాలి. కొన్ని కథలు వున్నాయి. వాటిపై వర్క్ చేయాలి. ముందుగా 14రీల్స్ లో నాగచైతన్య హీరోగా సినిమా చేస్తున్నా.


మీరు కథలని రాయడానికి ఎలా స్ఫూర్తి పొందుతారు ? సర్కారు వారి పాట కథ ఎలా పుట్టింది ?

మెదడు నిరంతరంగా పని చేస్తూనే వుంటుంది కదా.. కొన్ని సంఘటనలు చూసినప్పుడు, చదివినప్పుడు , విన్నప్పుడు... ఇలా బోలెడు సందర్భాలు వుంటాయి. ఎక్కడో ఒక పాజ్ వస్తుంది. అక్కడి నుండి కథగా ఏర్పడే అవకాశం కూడా వుంటుంది.  సర్కారు పాట విషయానికి వస్తే.. ప్రతి కామన్ మ్యాన్ జీవితంలో జరిగేదే. కామన్ మ్యాన్ అడియాలజీ.


మీ రైటింగ్ స్టయిల్ ఇష్టమని మహేష్ బాబు చాలా సార్లు చెప్పారు. మీ రైటింగ్ లో ఆయనకి అంతగా నచ్చిన అంశం ఏమిటి ?

నాతో ప్రయాణంలో చిన్న ఫన్ వుంటుంది. మహేష్ గారికి నాకు బాగా సింక్ అయ్యింది. రైటింగ్ అంటే ఫ్లోలో వస్తుంటాయి. సీన్ డిమాండ్ చేసిన దాని బట్టి దాని డెప్త్ బట్టి నేచురల్ గా వస్తాయి.


సర్కారు వారి పాట సెట్స్ పై వున్నప్పుడు మార్పులు ఏమైనా జరిగాయా ?

లేదు. మహేష్ బాబు గారికి ఒక సారి కథ నచ్చిన తర్వాత మరొఆలోచన వుండదు. ఒకవేళ కథ పై డౌట్ వుంటే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళదు. ప్యాండమిక్ లో మహేష్ గారు కరోనా జాగ్రత్తలు చెప్పేవారు తప్పితే సినిమా కథ గురించి అసలు టాపికే వుండేది కాదు. ఒకసారి లాక్ చేసిన కథని ఆయన అంత బలంగా నమ్ముతారు.  


మహేష్ గారు, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు.. దాదాపు టీమ్ సర్కారు వారి పాటని పోకిరితో పోల్చడానికి కారణం ?


సర్కారు వారి పాటని పోకిరితో పోల్చడం అంటే రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని కాదు. సర్కారు వారి పాట కి పనిచేస్తున్నప్పుడు మహేష్ గారికి పోకిరి రోజుల్లో కలిగిన వైబ్స్ వచ్చాయి. అలాగే మార్తాండ్ కే వెంకటేష్ గారు పోకిరి కి పని చేశారు. ఆ సినిమా ఎడిట్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ గా ఫీలయ్యారో సర్కారు వారి పాటకు కూడా అదే పాజిటీవ్ వైబ్ కలిగింది. మేము అంతా అనుకున్నట్లే సర్కారు వారి పాట పెద్ద విజయం సాధించింది.


చాలా స్లిమ్ గా మారిపోయారు .. మహేష్ బాబు గారి ఇన్స్పిరేషన్ ఆ ?

మహేష్ గారి పక్కన వుండి రెండేళ్ళు పరిశీలిస్తే ఎవరైనా ప్రేరణ పొందుతారు. అందులో నేను ఒక్కడిని. మహేష్ గారు హెల్త్ గురించి ఎక్కువ అడుగుతారు. ప్రతి షెడ్యుల్ లో నన్ను చూసి చాలా చక్కగా వున్నారని స్వయంగా మహేష్ బాబు గారే అనడం ఇంకాస్త ప్రేరణ ఇచ్చింది.


మీ సినిమాల్లో హీరోయిన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేస్తారు.. కానీ సర్కారు వారి పాటలో  స్థాయిలో వుందని భావిస్తున్నారా ?  
సర్కారు వారి పాటలో హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర చాలా కీలకంకథని ఒక మలుపు తిప్పే పాత్ర.నా పాత సినిమాల హీరోయిన్స్ స్థాయిలోనే కళావతి పాత్రని డిజైన్ చేశాకథలో  పాత్ర బిహేవియర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.

సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పై హీరో కాలు వేసిన సీన్స్ ని  ఎలా సమర్ధిస్తారు ?  
 సీన్స్ లో ఎక్కడా వల్గారిటీ లేదుఅలాంటి వల్గారిటీ వుంటే మహేష్ గారే వద్దని చెప్తారుతల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా  సీన్స్ ఉంటాయి తప్పితే అందులో వల్గారిటీ లేదు.  

నాగచైతన్య సినిమా షూటింగ్ ఎప్పుడు ?
స్క్రిప్ట్ పూర్తయిందిషూటింగ్ వివరాలు త్వరలోనే చెప్తాం.

ఆల్ ది బెస్ట్
థ్యాంక్ యూ



Share this article :