Home » » Bhale Bhale Banjara Song From Megastar Chiranjeevi Acharya Out Now

Bhale Bhale Banjara Song From Megastar Chiranjeevi Acharya Out Now

 ‘ఆచార్య’ సినిమా  నుంచి ‘భలే భలే బంజారా..’ సాంగ్ రిలీజ్.. ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్



‘‘

సింబా రింబ సింబా రింబ సిరత పులుల సిందాట‌

సింబా రింబ సింబా రింబ స‌ర‌దా పులుల స‌య్యాట‌


సీమ‌లు దూర‌ని సిట్ట‌డ‌వికి సిరున‌వ్వొచ్చిందీ

నిప్పు కాక రేగింది.. డ‌ప్పు మోత మోగింది


కాకులు దూర‌ని కార‌డ‌విలో పండ‌గ పుట్టింది

గాలి గంతులాడింది.. నేల వంత పాడింది

సీక‌టంతా సిల్లుప‌డి ఎన్నెల‌య్యిందియాలా

అందినంత దండుకుందా ప‌ద త‌లో చేయ్యలా


భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా

భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా  ’’


అని ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అస‌లు వారికి అడ‌విలో ఏం ప‌ని.. వారిని చూసి ఆడ‌వి బిడ్డ‌లు ఎందుకు సంతోషంగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. అనే విష‌యాలు తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. 


మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. 



చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో చాలా బిజీగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఆచార్య సినిమా పోస్ట‌ర్స్ .. టీజ‌ర్‌.. ట్రైల‌ర్‌.. రెండు పాట‌ల‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సోమ‌వారం రోజున చిత్ర యూనిట్ ‘భలే భలే బంజారా..’ అనే పాటను విడుదల చేశారు. పాటకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. 


మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఆచార్య సినిమాలోని ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. 


పాట వినసొంపుగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్యూన్‌కి త‌గ్గ‌టు ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి.. మ‌రో వైపు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వేసిన స్టెప్స్  కొన్నింటిని ఈ సాంగ్‌లో చూడొచ్చు. ఇద్ద‌రు పోటీ ప‌డి డాన్సు చేసిన ఈ పాట థియేట‌ర్‌లో రేపు ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది.



Share this article :