Home » » Etla First Look Launched by Harish Rao

Etla First Look Launched by Harish Rao

 మంత్రి హరిష్ రావు గారి చేతులమీదుగా  "Eట్లు"సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..



శ్రీజ ఆర్ట్స్ & బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్. బాచిన నాగేశ్వరరావు ల నిర్మాణంలో వస్తున్న సినిమా "Eట్లు". ఈ సినిమాకు పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "Eట్లు"

ఈ చిత్ర ఫస్ట్ లుక్  మంత్రి హరిష్ రావు గారి చేతులమీదుగా  ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ..

ఈ "Eట్లు" మూవీ టీమ్ చూస్తుంటే అందరూ కొత్తవారికి ఉన్నారు అయిన దైర్యం చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్న Eట్లు టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. దర్శకుడు రొశి రెడ్డి ప్రొడ్యూసర్స్ కి ఈ చిత్రం వియవంతంగా ప్రదర్శించి మంచి పేరుతో డబ్బులు తెచ్చి పెట్టాలి అని కోరుకుంటున్నాను అని మాట్లాడారు.


ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.. మా చిన్న చిత్రాన్ని పెద్ద మనసుతో పోస్టర్ లాంచ్ చేసిన హరీష్ రావు గారి కి మా "Eట్లు"మూవీ టీమ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.


దర్శకుడు రొశి రెడ్డి మాట్లాడుతూ..

ముందుగా నా మొదటి సినిమా "Eట్లు" ని ఆశీర్వదించిన మా హరీష్ రావు సార్ గారికి పాదాభి వందనాలు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విజన్ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది మిగతా వివరాలు అతి త్వరలో తెలియజేస్తాము అని అన్నారు.


ఈ చిత్ర హీరో హీరోయిన్ మాట్లాడుతూ..

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా మా సినిమా "Eట్లు" ఫస్ట్ లుక్  విడుదల కావడం మా అదృష్టం ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ గా "Eట్లు' సినిమా ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.


నటీనటులు: 

అమీర్, ప్రణీత, దీపిక, సీనియర్ ఆర్టిస్టులు మహాలక్ష్మి, జి.వి నారాయణ రావు, జబర్దస్త్ యాక్టర్స్  జీవన్ ,రాజమౌళి , కొమురం , బాబి ,శిరీష , గెస్ట్ రోల్ సుమన్ తదితరులు


టెక్నికల్ టీమ్: 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: పందిళ్లపల్లి రొశి రెడ్డి

నిర్మాతలు: పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాచిన నాగేశ్వరరావు

కెమెరా మెన్: రామరాజు మరియు నిమ్మ గోపి.

సంగీతం: శివ-ప్రణయ్

కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి

ఫైట్స్: పి సతీష్ 

పి. అర్. ఓ  : కడలి రాంబాబు


Share this article :