Suchirindia CEO Lion Kiron Supporting Ms.Keyura, Badminton Player 1 lakh Cheque as Beginning of the Sponsorship

 Suchirindia CEO Lion Kiron Supporting  Ms.Keyura, Badminton Player 1 lakh Cheque as Beginning of the Sponsorship



లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష రూపాయ‌లను అందించారు.


 జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్య‌ల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సుచిరిండియా సీఎండి ల‌య‌న్ కిర‌ణ్ కుమార్ ల‌క్ష రూపాయ‌ల చెక్కును ఆమెకు అందించారు. ఈ సంద‌ర్భంగా ల‌య‌న్ కిర‌ణ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా భారత్ త‌రుపున పోటీప‌డి ప‌త‌కాలు సాధించి వారు ప్ర‌పంచ స్థాయిలో భార‌త్‌కు గుర్తింపు తీసుకొస్తార‌న్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొద‌లుకొని అన్ని ర‌కాల క్రీడాకారుల‌కు సుచిరిండియా త‌రుపున అవ‌స‌ర‌మైన సామాజిక ఆర్థిక స‌హాకారాన్ని అందిస్తున్నామ‌ని అన్నారు. యువ క్రీడాకార‌ల‌ను గుర్తించి వారికి అవ‌స‌ర‌మైన సాయాన్ని అందించ‌డం ద్వారావారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తార‌న్నారు. కెయూరాకు మున్ముందు అవ‌స‌ర‌మైన మ‌రింత సాయాన్ని అందిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే సుచిరిండియా త‌రుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన సాయాన్ని అందిస్తూ వారిని ప్రోత్స‌హిస్తున్నామ‌ని, అంతేకాకుండా ర‌న్ ఫ‌ర్ హైద‌రాబాద్‌, ర‌న్ ఫ‌ర్ హ్యాపినెస్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించామ‌ని కిర‌ణ్‌కుమార్ తెలిపారు. కెయూరా మాట్లాడుతూ.. ఆల్ ఇండియా కేట‌గిరిలో 12వ ర్యాంకును, ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్నీల‌లో 240 ర్యాంకులో ఉన్న తాను తాజాగా ఐరిష్ ఓపెన్ చాలెంజ్‌లో బ్రాంజ్ ప‌త‌కం సాధించాన‌ని అన్నారు. జ‌న‌వ‌రిలో ఇండియా ఓపెన్‌తోపాటు మ‌రో రెండు టోర్నీల్లో పాల్గొంటున్నాన‌ని అన్నారు. త‌న త‌ల్లిదండ్ర‌లు త‌న‌కు ఎంతో స్పూర్తి అని, వారి కార‌ణంగానే తాను ఇంత దూరం వ‌చ్చాన‌న్నారు. త‌న తండ్రి ఉద్యోగాన్ని వ‌దిలి అయిదేళ్లుగా త‌న క్రీడా భ‌విష్య‌త్తు కోసం కృషి చేస్తున్నార‌న్నారు. త‌ప్ప‌నిస‌రిగా దేశం కోసం ప‌త‌కాలు సాధిస్తామ‌ని, సుచిరిండియా అందిస్తున్న  సాయానికి ప‌త‌కాలు సాధించి త‌గిన ఫ‌లితం చూపుతాన‌ని అన్నారు. ఇగ్నోలో బీకాం మొద‌టి సంవ‌త్స‌రం పూర్తి చేశాను. చ‌దువు, ఆట‌కు స‌మ‌ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు కెయూరా వివ‌రించారు.

Post a Comment

Previous Post Next Post