Home » » Sri Lakshmi Narasimha Movie Makers Production No1 Launched

Sri Lakshmi Narasimha Movie Makers Production No1 Launched

 శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 ప్రారంభం.ధ‌ర్మ‌, పవి హీరో హీరోయిన్లుగా శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా నూత‌న చిత్రం రూపొందుతోంది. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో అనుభ‌వం ఉన్న నిర్మాత ప్ర‌వీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఆలోచింప‌జేసే క‌థ‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల‌కు సినిమాటొగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. మొద‌టి స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల క్లాప్ కొట్ట‌గా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో శ్రీ విష్ణు, ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేక‌ర్స్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి  నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజ‌రయ్యారు. డిసెంబ‌రు చివరి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.


తారాగ‌ణం: ధ‌ర్మ‌, పవి


సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి

నిర్మాత‌: జె. ప్ర‌వీణ్ రెడ్డి

సంగీతం: గౌర హ‌రి

సినిమాటోగ్రఫీ: కేశవ

క‌థ‌: కిషోర్ శ్రీ కృష్ణ‌

ఎడిట‌ర్‌: జెస్విన్ ప్ర‌భు

కో-ప్రొడ్యూస‌ర్‌: చైత‌న్య కందుల‌, సుబ్బారెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రామ‌బాలాజి. డి

పీఆర్ఓ: తేజస్వి స‌జ్జ


Share this article :