Home » » Lakshya Pre Release Event Held Grandly

Lakshya Pre Release Event Held Grandly

హార్డ్ వర్క్‌తో నాగశౌర్య తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. .. ‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌



`లక్ష్య` సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి సందేహం లేదు - శ‌ర్వానంద్‌


స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఆదివారం సాయంత్రం లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పుల్లెల గోపీచంద్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..


కాళ భైరవ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్.. నా కెరీర్ ప్రారంభంలో కొన్ని జానర్లలో సినిమాలు చేయాలని అనుకున్నాను. ఈ జానర్‌లో ఒక్కటైనా చేయాలి.. ఆ రకమైన సినిమాలకు మ్యూజిక్ చేయాలని అనుకున్నాను. అందులో స్పోర్ట్స్ సినిమా ఒకటి. అయితే నా కెరీర్‌లో ఇంత త్వరగా ఆఫర్ వస్తుందని అనుకోలేదు. ఇండియాలో మొదటి ఆర్చరీ బేస్డ్ సినిమా లక్ష్య. ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. సినిమా కోసం పని చేసిన నా టీం అందరికీ థ్యాంక్స్. అందరం కలిసి పని చేస్తేనే ఇలాంటి అవుట్ పుట్ వస్తుంది. డిసెంబర్ 10న మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.


నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘లక్ష్య సినిమాను ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందుగా ప్రారంభించాం. ఎప్పుడు వీలైతే అప్పుడు షూట్ చేశాం. మొత్తానికి సినిమాను ముగించేశాం. ఈ ఏడాదిన్నర జర్నీలో నాగ శౌర్య ఎంతో ఫోకస్‌గా ఉన్నాడు. ఇందులో నాలుగు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడు. లాక్డౌన్‌లో ఎంతో కష్టపడ్డాడు. తన బాడీని మార్చుకున్నాడు. ఆయన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డీఓపీ రామ్ అద్బుతంగా చూపించారు. కాళ భైరవ మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్టర్‌కు ఏం చేయాలో చాలా క్లారిటీ ఉంటుంది. కేతిక శర్మ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఈ బ్యానర్ పెట్టేందుకు కారణమైన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఏసియన్ వారితో కలిశాను. నారాయణ్ దాస్ గారితో చేసే ప్రయాణంలో సునీల్ నారంగ్ వంటి అద్బుతమైన వ్యక్తి కలిశారు. రామ్ మోహన్ గారు అవసరమైనప్పుడు ముందుకు వచ్చేవారు. మేమంతా కలిసి ఓ టీంలా పని చేశాం. పుల్లెల గోపీచంద్ గారు ఈ జాతికి గర్వకారణం. శేఖర్ కమ్ముల గారికి ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు గోపీచంద్, శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


ఆర్ట్ డైరెక్టర్ షర్మిల మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాత శరత్ మరార్ గారికి థ్యాంక్స్. సంతోష్ గారు లేకపోతే ఇంత బాగా వచ్చేది కాదు. ఆర్చరీకి ఏముంటుందిలే అనుకున్నా కానీ.. ఆటను అర్థం చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ వర్క్ చూస్తారు. ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురుచూశాను. అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మైల్ స్టోన్‌లా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘లక్ష్య ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ సర్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్. నాగ శౌర్యతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. కాళ భైరవ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామ్ గారు అందంగా చూపించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


డైరెక్టర్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. ‘నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా మొదటి సినిమా అవకాశం ఇచ్చిన వెంకట శ్రీనివాస్‌ గోకారం గారికి కృతజ్ఞతలు. సుబ్రమణ్యపురం సినిమా తర్వాత సునీల్‌ నారంగ్‌ గారు తన ఆఫీసుకు పిలిచి కథ విని వెంటనే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కథను నాగ శౌర్య గారికి వినిపించాను. ఫస్ట్‌ హాఫ్‌ మూడున్నర గంటలు అత్యంత ఓపికతో విన్నారు. ఆ వెంటనే కథను ఓకే చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినేషన్‌. ఇట్స్‌ ఏ జర్నీ’ ఆ జర్నీయే మీరు డిసెంబర్‌ 10వ తేదీన థియేటర్లలో చూసే లక్ష్య సినిమా. కెమెరా రామిరెడ్డి ఫెంటాస్టిక్‌ విజువల్స్‌ ఇచ్చారు. రైటర్‌ సృజనా మణి గారు సృజనాత్మకంగా రాశారు. సినిమా అనేది ఓ కళారూపమైతే. దానికి ఆక్సిజన్‌ థియేటర్‌ వ్యవస్థ. ఆ ఆక్సిజన్‌ను అందజేసే వ్యక్తి నారాయణ దాస్‌ నారంగ్‌ గారు. ఈ కరోనా టైంలో లవ్‌స్టోరీని డేరింగ్‌గా థియేటర్లలో రీజ్‌ చేశారు. మళ్లీ ఇప్పుడు లక్ష్యను రిలీజ్‌ చేస్తున్నారు’ అని అన్నారు.


శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. స్పోర్ట్స్ నేపథ్యం, ఆర్చరీ సినిమా అవ్వడంతో సగం హిట్ అయింది. సినిమాకు అందరూ కష్టపడ్డారు. కచ్చితంగా బుల్‌సై కొడతారని అనిపిస్తోంది. మంచి టేస్ట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. నాగ శౌర్య ఫస్ట్ లుక్ నేనే విడుదల చేశాను. హార్డ్ వర్క్‌తో నాగ శౌర్య తన మార్క్  క్రియేట్ చేసుకున్నాడు. కేతిక శర్మకు మంచి సక్సెస్ రావాలి. చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు.


పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. ‘సినిమా మన అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ సినిమా వెనక ఎంతో మంది కష్టపడతారు. ఈ సినిమాకు ఖర్చు పెట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్. వారి కష్టానికి తగ్గట్టుగా ఈ సినిమాకు మంచి ఫలితం రావాలి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలి. నాగ శౌర్య, కేతిక శర్మలకు కంగ్రాట్స్’ అని అన్నారు.


హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ... ‘జై బాలయ్య...అఖండ సినిమాతో ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. డైరెక్టర్‌ సంతోష్‌ గారికి విష్‌ యూ ఆల్‌ది బెస్ట్‌. మీ కష్టం కనపడుతోంది. సినిమా సక్సెస్‌ కావాలని కోరకుంటున్నాను. ఫస్ట్‌ టైం ఆర్ట్‌ డైరెక్షన్‌ చేస్తున్న లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌కు కంగ్రాట్యులేషన్స్‌, ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ప్రొడ్యూషర్స్‌ రామ్మోహన్‌రావుగారు, సునీల్‌ గారు, శరత్‌ మారార్‌ నాకు ఎంతో సన్నిహితులు. వారు నాకు పెద్దన్నల్లాగా.. ఎల్లప్పుడూ నా మంచి కోరుకునే వాళ్లు. లక్ష్య సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్‌ సినిమా చేయటానికి చాలా ధైర్యం కావాలి. చాలా స్పోర్ట్స్‌ సినిమాలు వచ్చాయి. హిట్‌ అయ్యాయి. స్పోర్ట్స్‌ సినిమా తీయాలంటే ఆ శ్రమ మొత్తం హీరోపై పడుతుంది. పాత్రకు తగ్గట్టుగా మారి నటించటానికి చాలా డెడికేషన్‌ ఉండాలి. నాగ శౌర్య డెడికేషన్‌ ఉన్న నటుడు. ట్రాన్ఫర్మేషన్‌లో కష్టం కనపడుతోంది. ఓకే ఒక్క జీవితం, ఆడవాళ్లు తర్వాత సిక్స్‌ ప్యాక్‌ అయితేనే సినిమా చేస్తా. నాగశౌర్య నాకు స్ఫూర్తి. అందరితో చక్కగా రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడతాడు. తనకంటూ ఓ మార్కెట్‌ తెచ్చుకున్నాడు. మా బాస్‌ చిరంజీవి చెప్పినట్లు తప్పకుండా సూపర్‌ స్టార్‌ అవుతాడు’అని అన్నారు.


నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథను 2019లో విన్నాను. సునీల్ నారంగ్ గారు నాకు అన్నలాంటి వారు. ఫోన్ చేసి కథ విను అన్నారు. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా నిర్మాతలు ఈ సినిమాకు పెద్ద బలం. మా మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ అద్బుతమైన సంగీతం అందించారు. అఖండ సినిమాలో రెండు పాటలున్నాయి. మా సినిమాలో కూడా రెండు పాటలున్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు పాటలు అవసరం లేదు అని మరోసారి నిరూపించారు. కెమెరామెన్ రామ్ గారు నన్ను అద్భుతంగా చూపించారు. మా హీరోయిన్ కేతిక శర్మ ఈ సినిమాకు, మేం అనుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారు. రొమాంటిక్ సినిమాలో ఆమెను చూసి ఫిదా అయ్యాను. అది 2009 అనుకుంటాను. అప్పుడు హ్యాపీ డేస్ సినిమాను వదిలారు. శేఖర్ కమ్ముల గారి కోసం..పద్మారావు నగర్‌‌లో ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను. కానీ ఒక్కసారి కూడా చూడలేదు. మెట్ల మీద పెన్ను, ప్యాడ్ పట్టుకుని రాసుకుంటూ ఉండేవారు. ఆ డెడికేషన్ అవసరం. పుల్లెల గోపీచంద్ గారు ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు ఎంతో కష్టపడి అక్కడ గెలిస్తే.. మేం ఇక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం. ఇండస్ట్రీలో నాకు శర్వా  బెస్ట్ ఫ్రెండ్. శర్వా భయ్యాని ఓసారి కలిశాను. అప్పుడు సినిమా కాస్త ఆడలేదు. ఏమైనా డల్‌గా ఉంటాడేమో అనుకున్నాను. కానీ అలా లేడు. మనలో ఓ కన్‌సిస్టెంట్, నిజాయితీ ఉండాలని అన్నాడు. శర్వాలా అందరికీ ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. మా అందరికీ శర్వానంద్ ఇన్‌స్పిరేషన్. సక్సెస్ ఒక్కసారి వస్తుంది.. అది వచ్చే వరకు మనం ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు శర్వాకు థ్యాంక్స్’ అని అన్నారు.


Share this article :