Home » » Detective SatyaBhama Releasing on December 31st

Detective SatyaBhama Releasing on December 31st

 సోని అగర్వాల్‌   ‘డిటెక్టివ్‌ సత్యభామ’ డిసెంబర్ 31 న థియేటర్స్ లో విడుదల



   సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రం ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుంది.

           సోనీ అగర్వాల్ మాట్లాడుతూ...  ‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ  ఈ  "డిటెక్టివ్‌ సత్యభామ" ఆవుతుంది  ఎందుకంటే మూవీ పోస్టుపొడక్షన్ అంత ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ  నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది , ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.

            చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ ..  చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దామని చిత్రాన్ని ఈ నెల  డిసెంబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు

      దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ ..   ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించానని ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నాని అన్నారు .

 నటీ నటులు :

సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.


 సాంకేతిక నిపుణులు :

బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌

నిర్మాత : శ్రీశైలం పోలె మోని

సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి

కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి

డైలాగ్‌ : సంతోష్ ఇంగాని

పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి


Share this article :