Home » » Thankyou Movie First Look Launched

Thankyou Movie First Look Launched

 న‌వ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టినరోజు సంద‌ర్భంగా ‘థాంక్యూ ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల



న‌వ యువ సామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘థాంక్యూ’. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌, మాట‌ల‌ను అందించారు.  రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 23)న అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా థాంక్యూ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని కాస్త గ‌డ్డంతో ఉన్న అక్కినేని నాగ‌చైత‌న్య తిరునాళ్ల‌లోని తిరిగే రంగుల రాట్నంలోని గుర్రంపై ఎక్కి కూర్చుని తిరుగుతూ సంతోష ప‌డుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ...


నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మా థాంక్యూ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్ప‌టి వ‌రకు నాగ‌చైత‌న్య చేయన‌టువంటి ఓ వైవిధ్య‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. యాక్ట‌ర్‌గా ఆయ‌నలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే చిత్ర‌మిద‌ని క‌చ్చితంగా, న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. బి.వి.ఎస్‌.ర‌వి అందించిన అద్భ‌తుమైన క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్‌గారు మ‌రింత గొప్ప‌గా సినిమాగా మ‌లిచారు మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్, ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ , ఎడిట‌ర్ న‌వీన్ నూలి .. ఇలా ఓ బెస్ట్ సినిమాను అందించ‌డానికి బెస్ట్ టీమ్ వ‌ర్క్ చేసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. 


న‌టీన‌టులు:  

అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

నిర్మాత‌లు :  దిల్‌రాజు, శిరీష్‌

ద‌ర్శ‌క‌త్వం:  విక్ర‌మ్ కె.కుమార్‌

స‌హ నిర్మాత : హ‌ర్షిత్ రెడ్డి

కథ, మాటలు: బి.వి.ఎస్.రవి

సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌:  పి.సి.శ్రీరామ్‌

ఎడిట‌ర్ :  న‌వీన్ నూలి


Share this article :