Shakalaka Shankar corporator Releasing on November 26th

నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షకలక శంకర్ 'కార్పొరేటర్' !!!



స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం 'కార్పొరేటర్'. 'సంజయ్ పూనూరి'ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్ అధినేత డాక్టర్ ఎస్.వి. మాధురి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా దాదాపు 200 థియేటర్స్ లో  నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.


కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు - 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు.


శంకర్ సరసన సునీత పాండే-లావణ్య శర్మ- కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: వింగ్ చున్ అంజి, డాన్స్: సూర్యకిరణ్- వెంకట్ దీప్, ఎడిటింగ్: శివ శర్వాణి, కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: ఎం.ఎల్.పి.రాజా, నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి!!!


Post a Comment

Previous Post Next Post