Home » » Powerstar Pawan Kalyan Director Trivikram Wishes to Republic Team

Powerstar Pawan Kalyan Director Trivikram Wishes to Republic Team

 సాయితేజ్‌ను న‌టుడిగా మ‌రో రేంజ్‌లో కొత్తగా ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’ను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా, నిర్మాత‌లు అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు:  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌సాయితేజ్ హీరోగా దేవ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాను అక్టోబ‌ర్ 1న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. రొటీన్ సినిమాకు భిన్నంగా రూపొందిన ఈ మూవీలో సాయితేజ్ త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. స‌మాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒక‌టైన సినిమా మాధ్య‌మంలో ప్ర‌భావ వంత‌మైన సినిమాలు చేయాల‌ని భావించి ప్రారంభం నుంచి అలాంటి సినిమాల‌నే తెర‌కెక్కిస్తోన్న ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా మ‌రోసారి త‌న మార్క్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. సూప‌ర్‌హిట్ టాక్‌తో ర‌న్ అవుతోన్న ఈ సినిమా స‌క్సెస్ గురించి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట్ త్రివిక్ర‌మ్ చిత్ర‌యూనిట్ స్పందిస్తూ ఎంటైర్  యూనిట్‌ను అభినందించారు. 

‘‘ఇప్ప‌టి వ‌ర‌కు సాయితేజ్ చేసిన సినిమాల‌కు రిప‌బ్లిక్ సినిమా పూర్తి భిన్న‌మైన‌ది. న‌టుడిగా త‌న కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రం. అలాగే త‌న‌ను యాక్ట‌ర్‌గా కొత్తగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. స‌మాజంలో రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వోద్యోగులు, న్యాయ వ్య‌వ‌స్థను మూడు గుర్రాల‌తో పోల్చి అవి ఎలా ఉండాలి.. ఎలా ఉన్న‌ప్పుడు సామాన్య ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తెలియ‌జేసేలా , నేటి స‌మాజంలో ఉన్న ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా రిప‌బ్లిక్ చిత్రాన్ని దేవ‌క‌ట్టా అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమాలోని ప్ర‌తి పాత్ర మ‌న‌కు న‌చ్చేలా తీర్చిదిద్దారు దేవ క‌ట్టాగారు. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, నేప‌థ్య సంగీతం, సుకుమార్‌గారి కెమెరా వ‌ర్క్ అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. అలాగే ఇంత మంచి టీమ్‌ను ఓ చోట చేర్చి సినిమాను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన నిర్మాత‌లు  జె.భగవాన్, జె.పుల్లారావు, జీ స్టూడియోస్‌వారికి ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌.

Share this article :