Home » » O Madhu Pre Release Event Held Grandly

O Madhu Pre Release Event Held Grandly

 ఘణంగా జరిగిన 'ఓ మధు' ప్రి రిలీజ్ ఈవెంట్.  *బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ.యమ్ ఖాన్ నిర్మిస్తున్న చిత్రం "ఓ మధు' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో  ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వవ్భిన తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ఓ మధు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, ఆడిషినల్ యస్.పి.లక్ష్మణ్  తదితర సినీ,రాజకీయ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ ను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో* 


 *తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..* ట్రైలర్ చాలా బాగుంది. మా ముందు పుట్టి పెరిగిన అబ్బాయి ఈ రోజు హీరోగా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. తల్లి కోరిక తన కొడుకు డాక్టర్ కావాలని, తండ్రి కోరిక  యాక్టర్ అవ్వాలని అందుకే హీరో డాక్టర్ గా, యాక్టర్ గా రాణించి తల్లిదండ్రులు కోరికలను నెరవేర్చ డానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఈ నెల 29 న విడుదల అవుతున్న ఈ సినిమా దర్శక,నిర్మాతలకు పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు 


 *మాజీ ఎమ్మెల్యే నగేష్ మాట్లాడుతూ* ..సినీ నేపథ్యం ఉన్నవాళ్లే సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కాలు పెట్టడానికి చాలా సంవత్సరాలు గా ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఎటువంటి సినిమా నేపథ్యం లేని ఏ.యమ్. ఖాన్ ఈరోజు ఈ సినిమా చేయడం సంతోషం. భువనగిరి నుంచి ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి యాదగిరిగుట్ట ఖిల్లా మహత్యం అనుకుంటాను. ఖాన్ కొడుకు ఈరోజు హీరో అవ్వడం చాలా సంతోషం .తండ్రి కొడుకులు ఏకకాలంలో నటిస్తూ ప్రొడ్యూస్ చేయడం వారి అదృష్టం. ఈలాంటి అవకాశం చాలామందికి రాదు. జీవితంలో వెండితెరపై కనిపించడం అంత ఈజీ కాదు, కనిపించినా నిలబడడం చాలా కష్టం మరి తను చదువుతోపాటు నటుడుగా రాణిస్తూ స్క్రీన్ మీద మంచి మంచి అవకాశాలు తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలో రాణించాలని కోరుతున్నాను అన్నారు. *ఆడిషినల్ యస్.పి.లక్ష్మణ్ మాట్లాడుతూ* ..  టైలర్ చూస్తుంటే అబ్బాయి కళ్లల్లో మధువు ఓలుకుతుంటే, అమ్మాయి పెదాలపై తేనె ఓలుకుతుంది.ట్రైలర్ చాలా బాగుంది.ఇద్దరు ఖాన్ లతో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ ఖాన్స్ అంత ఎత్తుకు వీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. *నిర్మాత సత్యారెడ్డి గారు మాట్లాడుతూ* ..మంచి లొకేషన్ లలో సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. దర్శకుడు పానుగంటి రాజారెడ్డి తన దర్శకత్వ పటిమను జోడించి అద్భుతమైన సినిమాను చిత్రీకరించాడు.ఈ మధ్య హారర్ మూవీ అన్ని భాషల్లో భాషా భేదం లేకుండా రిలీజ్  అవుతున్నాయి. ఈ చిత్రం కూడా అన్ని భాషల్లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగి దర్శక నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి. హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. వీరు అనేక సినిమాల్లో నటించి పెద్ద నటులుగా ఎదగాలి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని ఈ రోజుల్లో ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు దొరకడం అంటే ఈ సినిమా విజయం సాధించినట్లే.. ఈ నెల 29న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మరోమారు ఆకాంక్షిస్తున్నాను . *చిత్ర నిర్మాత.ఏ.యమ్ ఖాన్ మాట్లాడుతూ* ...మా ప్రి రీలీజ్ ఈవెంట్ సునీత లక్ష్మారెడ్డి గారు,నగేష్ గారు ఇలా అనేక మంది పెద్దలు మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. దర్శకుడు మంచి కంటెంట్ తో సినిమాను అద్బుతంగా తీశాడు. సంగీత దర్శకుడు మంచి పాటలు అందించాడు.సినిమా చాలా బాగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు. *చిత్ర దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ* ..ఈ సినిమాను నిర్మాతలు ఎక్కడా బడ్జెట్ కు కాంప్రమైజ్ కాకుండా  ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది.ఇంత మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. *సహ నిర్మాత వాజిద్ మాట్లాడుతూ ...* ఇది హర్రర్ , ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ ఈ సినిమా చాలా బాగుంది.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. *సంగీత దర్శకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ..* ఈ సినిమా లో పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా కూడా చాలా బాగా బాగుంది.ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు. *హీరో అబ్రార్ ఖాన్ మాట్లాడుతూ...* మా 'ఓ మధు' చిత్రాన్ని ఆశీర్వదించదానికి వచ్చిన సునీత లక్ష్మారెడ్డి మేడమ్ కు,నగేష్ సర్ ఇలా అనేక మంది పెద్దలు మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఈ రోజు నేను ఈ స్టేజ్ పై నిల్చోడానికి కారణమైన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
 *హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ..* బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో హారర్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న "ఓ మధు" చిత్రం గొప్ప విజయం సాధించి మాకందరికీ మంచిపేరు రావాలి.ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా లో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

  


 *నటీనటులు* .. 

అబ్రార్ ఖాన్, ఐశ్వర్య , వాజిద్ ఖాన్, ఖలీల్ జాంబియా 


 *సాంకేతిక నిపుణులు* 

సినిమా :  'ఓ మధు'

ప్రొడ్యూసర్ : ఏ.మహమ్మద్ ఖాన్ 

డైరెక్టర్ : రాజారెడ్డి పానుగంటి 

కో-ప్రొడ్యూసర్స్ : వాజిద్, బాల్రాజ్, రవి 

మ్యూజిక్ డైరెక్టర్ : జితేందర్ రెడ్డి 

డాన్స్ మాస్టర్ : స్వప్నిల్ 

కో-డైరెక్టర్ : పురం కృష్ణ 

మేనేజర్ : హేమంత్  

పి.ఆర్. ఓ : మధు వి.ఆర్Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again