Home » » Most Eligible Bachelor Grand Success Meet

Most Eligible Bachelor Grand Success Meet

 *అక్కినేని గారి ఫ్యామిలీ తో మా జర్నీ ఇలాగే కొన సాగుతుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో అల్లు అర్జున్* 


 "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్
 మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని ,బుట్ట బొమ్మ పూజా హెగ్డే  హీరో, హీరోయిన్లు గా.త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్లీగా వుండేలా డిజైన్ చేసే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.” భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని ఏరియాల నుండి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించ బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ ల్లో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు వంశీ పైడి పల్లి,దర్శకుడు సురేందర్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకొని ఇంత మంచి సినిమా తీసిన చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిధిగా పుష్పరాజ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  


 *హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ..* సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ కు కంగ్రాజులేషన్. అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ లా అనిపిస్తుంది అఖిల్ సినిమా రాకముందే నేను నాగార్జున సార్ ని కలిశాను అఖిల్ ని ఇలా చేస్తే బాగుంటుందా అనేసి నా చిన్న సలహా ఇచ్చి కలవడం జరిగింది. ఇష్టం ఉంది కాబట్టే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా నేను వెళ్లి చెప్పడం జరిగింది. అలాంటి అఖిల్ కి ఈ రోజు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది .అఖిల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు బాగా ఫైట్ చేస్తాడు ఇవన్నీ చేయగలిగి కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని  ఒక  మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా చేశాడు. అందుకే ఏ ఈరోజు ఈ సినిమా  ఇంత బాగా రావడానికి కారణమైంది.తను ఎన్నుకున్న కథ చాలా బాగుంది. రియల్లీ అప్రిషియేట్. మా నాన్నగారు చెప్పినట్టు ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వరరావు గారుమా తాత  అల్లు రామలింగయ్య గారు ఈ సక్సెస్ ను చూస్తుంటారు. అక్కినేని గారి ఫ్యామిలీ తో మా ప్రయాణం చాలా సంవత్సరాలుగా సాగుతుంది.ఫ్యూచర్ లో కూడా మా జర్నీ అలాగే కంటిన్యూ సాగుతుంది..లవ్ స్టోరీ సినిమా ద్వారా చైతన్య గారు, ఇపుడు అఖిల్ ఇద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారు. వీరిద్దరికీ కంగ్రాచులేషన్. పూజాను నేను డీజే నుంచి చూస్తున్నాను సినిమా తర్వాత సినిమా తన పెర్ఫార్మన్స్ తో బెటర్మెంట్ ఇస్తూ ఉంది.బొమ్మరిల్లు భాస్కర్ చాలా హార్డ్ వర్కర్,  వాసు వర్మ ఈ సినిమాకు చాలా సపోర్ట్ గా నిలిచారు. గోపి సుందర్ కి తెలుగు రాకపోయినా చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. బన్నీ వాసు గారు మరొక బిగ్ హిట్ ని అందు కున్నాడు. ఈ మధ్యకాలంలో బన్నీ వాసు ఇంత కష్టపడడం నేను చూడలేదు.. మా నాన్నగారిని నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన ఎప్పుడు కష్ట పడుతూనే ఉంటాడు.మా ఫాదర్ పెద్ద, పెద్ద స్టార్ హీరోలతో, కొత్త వాళ్లతో తర్డ్ జనరేషన్ హీరోస్ తో ఇలా అందరితో పని చేస్తూ మంచి కథలతో బెస్ట్ మూవీస్ ఇస్తున్నాడు. టీం అంతా ఎంతో కష్టపడి  మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు. మంచి సినిమా తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని ఈ సినిమా నిరూ పించింది.ఇంత  పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు 


 *నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ...* ఈ సినిమాను ప్రేమించుకుందాం అనుకునేవారు, ప్రేమించుకునే వాళ్ళు,ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవారు, పెళ్లి చేసుకోవద్దు విడిపోదాం అనుకునే వారు, పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్నవారు, పెళ్లి చేసుకుని 40 ఏళ్లుగా కాపురం చేసుకున్న వాళ్లు వీరందరూ కూడా ఈ సినిమా చూడాలి.ఎందుకంటే ఏ ఏ స్టేజి లో మనం మన కాపురాలు ఎలా చేశాము అనేది చూసుకోవడానికి నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా 

చూడాలి. ఇది కమర్షియల్ గా మాట్లాడే మాట కాదు భాస్కర్ ఈ కథలో అటువంటి క్లారిటీ ఇచ్చాడు. 

సింపుల్గా చెప్పాలంటే  "వాట్ డు యు యాక్సెప్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్" అనే పదము సినిమాలోచాలా సార్లు  వస్తుంది. కానీ రియల్  లైఫ్ లో ప్రతి ఒక్కరూ తిరిగి చూసుకునేలా ఈ సినిమా ఉంటుంది.మ్యారేజ్ అనే ఒక అవగాహనను ఇంత చక్కగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా చెప్పలేదు.ఎంతో కష్టపడి పని చేసిన ఈ సినిమా టీం కి కృతజ్ఞతల చెప్పుకుంటున్నాను..నేను ఈ టీం తో జర్నీ చేసినపుడు ఈ టీం లో బన్నీవాసు ఉన్నందుకు నా పని నేను చాలా తేలిక అయ్యింది. మా అబ్బాయిలు బాబి, అర్జున్ లకు బన్నీ వాసు మంచి స్నేహితుడు, వారు మా బన్నీ వాసు ను తీసుకొస్తే వారి ద్వారా నేను తనను తీసుకున్నాను. భాస్కర్ తో సినిమా తీసేటప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయి.తనకు ఏది రావాలనుకుంటే అది వచ్చేవరకు తపన పడుతూనే ఉంటాడు .తను ఈ సినిమా తీయడానికి తన భార్య ఎంతో సపోర్ట్ చేసిందో నాకు అర్థ మవుతుంది. ఆమెకు ఈ స్టేజి మీద కృతజ్ఞతలు చెప్తున్నాను. అక్కినేని అల్లు ఫ్యామిలీ లతో 60 సంవత్సరాల పై నుండి ఈ జర్నీ సాగుతుంది. 60 సంవత్సరాల క్రితం మా నాన్న అల్లు రామ లింగయ్య గారు ,అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసారు. అప్పటి నుంచి వారు చాలా మంచి స్నేహితులు అయ్యారు. చివరి వరకూ వారు కలిసి ఉన్నారు .ఆ తర్వాత తరంలో నేను యాక్టర్ కాకపోయినా నాగార్జునతో నాకున్న అనుబంధం తో మా జర్నీ కొనసాగు తుంది.అలాగే ఆ తర్వాత నాగచైతన్య, ఇప్పుడు అఖిల్ తో సినిమా చేశాను.  ఇవాళ నా పిల్లలు వీరు మంచి స్నేహితులు. ఇలా ఇంకో రెండు తరాలు కూడా ఇలాగే సాగాలని ఆశిస్తున్నాను. అందుకని ఈ విషయం నేను అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది..గోపి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.పూజా ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది .తన కెరియర్ లో ఈ సినిమా ద్వారా ఉన్నత శిఖరం లో నిలబెట్టిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అని అన్నారు


 *దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..* మంచి సినిమా మంచి కథ వస్తే సినిమాను గుండెల్లో పెట్టుకొని చూస్తారు అనేది ఈ సినిమా నిరూపించింది. కోవిడ్ రాకముందు ఇండియన్ సినిమా మొత్తం కూడా తెలుగు సినిమా వైపు చూసేది. కొవిడ్ తర్వాత కూడా థియేటర్స్ లలో సినిమా రిలీజ్ చేయడానికి సహసించేవారు కాదు.అలాంటి టైం లో తెలుగు సినిమాలు థియేటర్స్ లలో విడుదల చేయడంతో ఇండియన్ సినిమాకు తెలుగు సినిమాలే మొదట  దిక్సూచిగా మారాయి. అలాగే ప్రతి కపుల్స్ కి ఒక్కొక్క కథ ఉంటుంది. బ్యూటిఫుల్ స్టోరీస్, బ్యాడ్ స్టోరీస్ ప్రతి ఒక్కరి లో ఉంటాయి. అలాంటిది భాస్కర్ పెళ్లి అనే ఒక కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొని పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు.. పెళ్లి చేసుకున్న తర్వాత కావలసిన ఎలిజిబిలిటీస్ ఏంటి అని చెప్పిన సినిమా.. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" బొమ్మరిల్లు భాస్కర్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు మనం ఏ సినిమా చేసినా మన హార్డ్ వర్క్ తొ చేసిన  ఎఫర్ట్ మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. సక్సెస్ అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. తను ప్రతి కొత్త సినిమాకు మంచి ఎఫెక్ట్ పెడుతూ కష్టపడుతూ  మంచి మంచి సినిమాలు తీస్తాడు.బన్నీ వాసు విషయానికొస్తే తను చాలా బ్రిలియంట్ ప్రొడ్యూసర్ ఒక సినిమాను ఎన్నుకున్న తరువాత డైరెక్టర్ దగ్గర నుంచి అసిస్టెంట్ వరకు ట్రావెల్ చేస్తూ ప్రతి ఒక్క యాక్సెప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి వారికి  సపోర్ట్ చేసే వ్యక్తి బన్నీ వాసు.ఇంత కష్టపడే వాసుకు ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాగే తన జర్నీ ముందుకు సాగాలి. అలాగే వాసువర్మ 

వర్మ కూడా చాలా కష్టపడ్డాడు ఇలాంటి మంచి సినిమాలు బన్ని వాసు, అల్లు అరవింద్ గారు , వాసు వర్మ లు కలసి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గోపి సుందర్ తో నా ఊపిరి సినిమాకు వర్క్ చేయడం జరిగింది. తను ఆ సినిమాకు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు కూడా ఎంతో అద్భుతమైన పాటలు ఇచ్చాడు.  వెంకటేష్ గారి ఎడిటింగ్ అద్భుతంగా ఉంది .అల్లు అరవింద్ గారు ఎందులో అడుగుపెట్టినా తన సంకల్పంతో విజయం సాధిస్తాడు. గీతా ఆర్ట్స్ లోకి బన్నీ వాసు  వచ్చి తనపై ఉన్న ఆ నమ్మకాన్ని నిలబెట్టు కున్నాడు. వీరందరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు  *దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ* ..ఒక మంచి టీం నిజాయితీగా కలిసి పని చేస్తే సక్సెస్ అనేది ఈజీ గా వస్తుంది దీనికి ఉదాహరనే ఈ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్". అరవింద్ గారితో రెండు సినిమాలకూ వర్క్ చేయడం  ద్వారా చాలా నేర్చుకున్నాను.అరవింద్ గారి తో చేస్తే ఆ ఎనర్జీ వేరు అందుకే తన తో మళ్లీ చేయాలనిపిస్తుంది. ప్రేక్షకులు ఇచ్చిన ఈ సక్సెస్ ఇండస్ట్రీకి ఈ టీం అందరికీ ఒక ఎనర్జీ ఇచ్చింది. అఖిల్ ఈ సినిమాతో ఒక ఆర్టిస్ట్ గా తన చక్కని నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. . నెక్స్ట్ తనతో నేను చేస్తున్న "ఏజెంట్" సినిమా ద్వారా ఒక స్టార్ ని చూస్తారు అన్నారు.  *నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ..* చాలా తక్కువ సినిమాలకే ఇంత పెద్ద సక్సెస్ మీట్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది. ఇలాంటి అవకాశం ఈ సినిమాకు ఇచ్చిన ప్రేక్షకులకు నా ధన్య వాదాలు.పెళ్లి చేసుకున్న ప్రతి భార్యా,భర్తల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అలా నా ఫ్రెండు ఫ్యామిలీ తో అప్పుడప్పుడు వారి మధ్య గొడవలు జరిగేవి. వారి సమస్యను తన ఫ్రెండ్స్ అయిన మేమంతా కలసి కౌన్సిల్ దగ్గరికి తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళం. చాలాసార్లు వారు విడిపోయే పరిస్థితి వచ్చినా కూడా మేమందరం వారికి చెప్పి కలపడం జరిగేది.అలా వారు గత 20 సంవత్సరాలు గా ఇబ్బంది పడుతున్న తను నాకు కాల్ చేసి మా ఇద్దరి మధ్య వస్తున్న డిస్టబెన్స్ కి ఈ సినిమా చూసిన తర్వాత మాకు సొల్యూషన్ దొరికింది.ఒకరికి ఒకరు ఎలా  కమ్యూనిటీ చేసు కోవాలో తెలియక ఇబ్బంది పడే వాళ్లం. ఈ సినిమా చూసిన తర్వాత నేను రెండు పాయింట్లు దగ్గర కనెక్ట్ అయ్యాను. నాకు ఆఫీస్ అయిన తరువాత ఇంటికి వెళ్ళాలి అనిపించేది కాదు అందుకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లేవాణ్ణి. అలా  నా జీవితం మెకానికల్ జీవితం లాగా ఇప్పటివరకు కొరకు సాగింది.ఈ సినిమా చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ తో ఎం కొల్పోయానో తెలుసుకొని  ఇంటికి వెళ్ళి నా ఫ్యామిలీతో కబుర్లు చెప్పడం మొదలు పెట్టాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మేము ఎంత చెప్పినా వినని వాడు ఈ సినిమా ద్వారా వారి ప్రాబ్లమ్ తెలుసుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. తను నాకు ఫోన్ చేసి ఇంత మంచి సినిమా తీసిన భాస్కర్ కి ధన్యవాదాలు అని చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది.చాలా మంది భార్యలకు భర్తలకు వాళ్ల భార్యలను ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక చిన్న ప్రాబ్లమ్ దగ్గర ఫీల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ సినిమాకు ఇద్దరు కలిసి వచ్చి సినిమా చూస్తే  ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సినిమానే వారికి చెబుతుంది. ఆప్పటి వరకు వారిద్దరి మధ్యలో ఉన్న సైలెన్స్ ని ఈ సినిమా విడగొటీ కలుపుతుంది. సినిమా అయిపోయిన తర్వాత చూసిన వారందరూ హ్యాపీగా బయటకు వచ్చి వారి వారి లోపాలను గుర్తు తెచ్చుకొని సరిదిద్దుకొని హ్యాపీ గా ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలా మంది నాకు ఫోన్ చేసి భాస్కర్ గారు ఆడవాళ్లను మనస్సు బాగా అర్థం చేసుకుని ఈ సినిమాను చాలా చక్కగా తీశాడు అని చెప్తున్నారు. అలాగే ఇందులో ఎటువంటి ఫైట్స్ ,ఎక్కువగా డ్యాన్స్ లేకుండా.. కథను నమ్ముకొని సినిమాను ఇంత బాగా తీయడం జరిగింది .అఖిల్  పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. 

ఒక నాగార్జున కొడుకు లాగా కాకుండా తన నటన తో 

ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి మంచి కథలను సెలెక్ట్ చేసుకొని చేయాలని అఖిల్ కోరుతున్నాను. పెద్ద కమర్షియల్  సినిమాలతో పాటు ఇలాంటి మంచి సినిమాల్లో నటిస్తే తనకు ఇంకా మంచి పేరు తీసుకు వస్తాయి. పూజ హెగ్డే కూడా చాలా బాగా నటించింది. మా బ్రదర్ గోపీసుందర్ అద్భుతమైన బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నా సక్సెస్ ని మా పేరెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలీదు గానీ నాకు సక్సెస్ వచ్చిందంటే హాట్ ఫుల్ గా ఎంజాయ్ చేసేది ఒక బన్నీ గారే.. అలాంటిది బన్నీ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా నేను పిలిచిన వెంటనే మా ఫంక్షన్ కి కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 


 *దర్శక నిర్మాత వాసు వర్మ మాట్లాడుతూ* ..బన్నీ గారు,

వంశీ పైడి పల్లి, సురేందర్ రెడ్డి లు ఎంతో బిజీగా ఉన్నా మా సక్సెస్ సెలబ్రేషన్స్ ఫంక్షన్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. బన్నీ ఎనర్జీ చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది .అల్లు అరవింద్ గారు ప్రతి సినిమాను ఫస్ట్ సినిమా గా ఎంతో ప్రేమతో హార్డ్ వర్క్ తో పనిచేస్తూ మా అందరి కంటే ఎంత హ్యాపీగా ఎంతో ఎనర్జీ గా ఉంటాడు. తండ్రి నుంచే అల్లు అర్జున్ కు అంత ఎనర్జీ పాస్ అవుతున్నట్టు  అనిపిస్తుంది.ఈ సినిమాకు అందరూ చాలా 

మనసుపెట్టి హార్డ్ వర్క్ చేశారు. బన్నీ వాసు నాకు 20 సంవత్సరాలుగా మంచి ఫ్రెండు. తనతోఈ సినిమా దాంతో చేయడం నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నిచ్చింది.తనతో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 

భాస్కర్ బొమ్మరిల్లు సినిమాకు ఎంత కష్టపడి పని చేశాడో అంతకంటే ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడి పని చేసి నందుకు చాలా సంతోషంగా ఉంది. నటీ,నటులందరూ చాలా చక్కగా నటించారు. అరవింద్ గారు ఈ సినిమా కొసం చాలా కష్టపడి వర్క్ చేశారు. ఆయన కష్టానికి ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా ఈ రోజు ఈ సినిమా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అఖిల్ నటన పరంగా చాలా అద్భుతంగా నటించాడు. రిలేషన్ షిప్ మీద పని చేసిన ఈ సినిమాను దర్శకుడు ఐ ఓపెనర్ గా తీయడం జరుగుతుంది.ఈ సినిమాను ఇంత గొప్ప విజయం సాధించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. *చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ* .. ఈ సినిమా అల్లు అరవింద్ గారి బ్యానర్లో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాసు వర్మ, బన్నీ వాసు, గోపి సుందర్ లు నాకు ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు 

ఈ సినిమాతో నేను అందరికీ దగ్గర అయినందుకు చాలా హ్యాపీగా ఉంది .కపుల్స్ అందరూ ఈ సినిమా కు కనెక్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పూజా హెగ్డే అఖిల్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా కుదిరింది.ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి నా ధన్యవాదాలు.అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారంతా డే వన్ నుండి ఇవాళటి వరకు రాత్రి పగలు నాతో ట్రావెల్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు. మార్తాండ వెంకటేష్ గారు 

చాలా నిద్రలేని రాత్రులు తో గడిపారు. నాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు . *హీరో అఖిల్ మాట్లాడుతూ* .. నేను అల్లు అరవింద్ లాంటి గొప్ప వ్యక్తి తో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకో తనని చూస్తుంటే నాకు నా గాడ్ ఫాదర్ లా ఫీల్ కలుగుతుంది . మా ఫాదర్ కు ప్రామిస్ చేసినట్టుగా అరవింద్ గారు నన్ను గుండెల్లో పెట్టుకుని ఒక కొడుకులా చూసుకున్నారు. మీ ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉన్నా కూడా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు వారికి నా ధన్యవాదాలు , ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 

సినిమాకు అందరం  కూడా ఎంతో కష్టపడి  నిజాయితీగా హార్డ్ వర్క్ చేశాము .మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఈ దసరా పండుగకు మీ ముందుకు వచ్చాం. మా సినిమా ను ఆదరించిన ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ కు 

దన్యవాదాలు.ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇద్దామను కున్నాము. మేము అనుకున్న ఈ కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నాను. ప్రేక్షకులు మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా తీసిన తర్వాత హిట్ కొట్టాము అని కాకుండా మీరిచ్చిన సక్సెస్ ఊపిరిని ఎనర్జీని తీసుకుని ముందుకు వెళ్తాను. తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది . థియేటర్లలో  విడుదల చేయొచ్చని తెలుగు ప్రేక్షకులు నిరూపించి మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చారు.  బన్నీ వాసు , బొమ్మరిల్లు భాస్కర్, వాసు వర్మ వీరంతా ఈ సినిమాకు పిల్లర్స్ గా నిల్చొని రెండున్నర సంవత్సరాల నుంచి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అరవింద్ గారు లేకపోతే ఈరోజు సినిమా లేదు అరవింద్ గారు మా పై పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా వర్క్ చేశాము. మమ్మల్ని సపోర్టు చేస్తూ బన్నీ బ్రదర్  మా ఈవెంట్ వచ్చి మాతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు అన్నారు. *హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ* .. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఊపిరి నిస్తుంది.ఈ సినిమా కోసం అందరూ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాలో చాలా గ్లామర్ గా మంచి పర్ఫార్మెన్స్ చేసావ్ అని చాలా మంది కాల్ చేశారు.  విభా లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన భాస్కర్ గారికి నా ధన్యవాదాలు అన్నారు. 


 *సంగీత దర్శకుడు గోపి సుందర్ మాట్లాడుతూ* ..మా మ్యూజిక్ ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది .మా టీమ్ అంతా కూడా  చాలా కష్టపడ్డారు .మా టీం సపోర్ట్ తో చేసిన ఈ సినిమా మ్యూజిక్ ఇంత పెద్ద హిట్  అయిందంటే చాలా సంతోషంగా ఉంది.  లెహరాయీ..., & గుచ్చే గులాబీ వంటి పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు  *నటుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ* .. ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు.ఈ కథ కొత్త ఒరవడిని తీసుకొస్తుంది. ఫ్యామిలీ రిలేషన్ లో యాంత్రికమైన ఈ జీవితంలో మన నుంచి ఫ్యామిలీ ఏం కోల్పోతుంది ? ఫ్యామిలీ నుంచి మనం ఏం కోల్పోతున్నామో .. అనేది ఈ సినిమా చాలా మందికి తెలియజేస్తుంది. చాలామంది లైఫ్ లో ఈ సినిమా ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. దీనికి కారణమైన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. గీతా ఆర్ట్స్ నుంచి కమర్షియల్ సినిమాలే కాదు మెసేజ్ ఉన్న మంచి సినిమాలు ఇస్తూ.. మంచి విలువలు ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్న అల్లు అరవింద్,బన్నీ వాసులకు  ధన్యవాదాలు అన్నారు *ఆర్టిస్ట్ ఐశ్వర్య మాట్లాడుతూ..* చాలా చిన్న పాత్ర అయినా మెమరబుల్ సీన్ ఇచ్చారు దర్శకుడుభాస్కర్ గారు నేను అంత బాగా చేయగలిగానంటే కారణం భాస్కర్ గారే.. నేను చేసిన ఆ సీన్ వల్ల నాకు ఆడియన్స్ దగ్గర్నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది భాస్కర్ గారికి నా ధన్యవాదాలు  అన్నారు. 


 *నటుడు అమిత్ మాట్లాడుతూ* .. ఈ మూవీ ఎంత కష్టపడి పనిచేశామో మా అందరికీ తెలుసు.దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు వారందరి కష్టమే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్.ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు 


 *నటుడు శ్రీకాంత్ అయ్యంగారు మాట్లాడుతూ* ..ఈ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాదించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. *న‌టీ న‌టులు:* 

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


 *సాంకేతిక నిపుణులు:* 

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, లక్ష్మీ నివాస్


Share this article :