Home » » Teja Sajja Adbhutham Movie Lyrical Song Launched

Teja Sajja Adbhutham Movie Lyrical Song Launched

 తేజ సజ్జ 'అద్భుతం' సినిమా నుంచి పేరేంటి ఊరేంటి లిరికల్ సాంగ్ విడుదల..తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా మహా తేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మిస్తున్న సినిమా అద్భుతం. మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఊరేంటి పేరేంటి లిరికల్ సాంగ్ విడుదలైంది. తేజ, శివాని రాజశేఖర్ ఇద్దరూ ఈ పాటలో చాలా అందంగా ఉన్నారు. రధన్ అద్భుతం సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ ఎడిటర్. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించారు. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు: 

తేజ సజ్జ, శివాని రాజశేఖర్..


టెక్నికల్ టీం: 

దర్శకుడు: మల్లిక్ రామ్

నిర్మాణ సంస్థలు: ఎస్ ఒరిజినల్స్, మహా తేజ క్రియేషన్స్

నిర్మాత: చంద్రశేఖర్ మోగుళ్ళ

కో ప్రొడ్యూసర్: సృజన్ ఎర్లబోలు

కథ: ప్రశాంత్ వర్మ 

స్క్రీన్ ప్లే, మాటలు: లక్ష్మీ భూపాల

సంగీతం: రధన్

ఎడిటర్: గ్యారీ BH

సినిమాటోగ్రాఫర్: విద్యాసాగర్ చింత

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again