Home » » Anandaiah Medicine Distributed at Film Chamber

Anandaiah Medicine Distributed at Film Chamber

 


ఫిలింఛాంబర్లో ఆనందయ్య మందు పంపిణీ

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి శ్రీ కె.ఎల్.దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్  శ్రీ ఏలూరు సురేందర్ రెడ్డి,  ,తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ శ్రీ ఇసనాకా సునీల్ రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీరి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ , స్టాఫ్ కు  మరియు మీడియా మిత్రులకు ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది 


 *ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ నిర్మాత సునీల్  రెడ్డి మాట్లాడుతూ..*  మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉండడంతో ఫిల్మ్ ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ ,స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఆనందయ్య మందు పంపిణీ లాంటిది చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు తెలపడంతో వారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతల కోరిక మేరకు ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్  ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ మరియు స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఈ ఆనందయ్య మందును అందిస్తున్నాము. ప్రసన్న కుమార్ ,దాము గారు ,

సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెంబర్స్ అందరికీ అందిస్తున్నాము .అలాగే ఈ మందును  ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు  ఒక బఠాని గింజంత వేసుకోవాలి. అలాగే రాత్రి భోజనం చేసే ముందు ఒక బఠాని గింజంత వేసుకోవాలి. ఒక రెండు రోజుల వరకు కూడా గుడ్డు, నాన్వెజ్ , ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇది కరోనా రాని వాళ్లకు మాత్రమే.. కరోనా వచ్చి పోయిన వారు కూడా ఈ మందు వేసుకోవచ్చు. మరియు కరోనా రాకుండా కూడా ఈ మందు వేసుకోవచ్చు. అలాగే కరోనాతో బాధ పడుతున్న వారు  మాత్రం ఈ మందు వాడకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రం వారం తర్వాత ఈ మందు వేసుకోవచ్చు. ఈ మందు వలన ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఆనందయ్య గారితో  నాకున్న పరిచయంతో ఆయనను రిక్వెస్ట్ చేసుకొని ఆనందయ్య గారి చేతుల మీదుగా మందు తయారు చేసుకొని తీసుకు రావడం జరిగింది. ఈ మందును సుమారు  500 మంది నుంచి 700 మంది వరకు ఈ మందు సరఫరా చేస్తున్నాము. దాము గారు, సురేందర్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ గాని ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు రెండు రోజులు ముందు తెలియజేస్తే నేను వారికి ఎంత అవసరం ఉందో అంత క్వాలిటీ తీసుకొచ్చి  అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇండస్ట్రీ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో  నా వంతు ఇలాంటి మంచు కార్యక్రమం చేస్తున్నానని అన్నారు. 


 *తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి  దాము గారు మాట్లాడుతూ..* నాకు రెండు రోజుల క్రితం సునీల్ రెడ్డి గారు ఫోన్ చేసి  నేను సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో ఆనందయ్య గారి దగ్గర నుండి ఈ మందు తీసుకు వచ్చి అందరికీ ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం చేయాలను కుంటున్నానని అని నాకు తెలియజేయడం జరిగింది. సునీల్ గారు చెప్పిన తరువాత ఈ మందు మంచిదే అని తెలుసుకొని ఈ మందు వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని తెలుకోవడమే కాకుండా క్రాస్ చెక్ చేసుకొన్న తరువాత తగిన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు వాడాలని సూచించడం జరిగింది. ఇది ఎలా వాడాలో మీకు సునీల్ రెడ్డి గారు తెలియజేయడం జరుగుతుంది.ఈ కవర్ లో  దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ ఉంది. ఆ పాంప్లెట్ ని ఫాలో అయి మీరందరూ వాడతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ , స్టాఫ్ కు  మరియు  మీడియా మిత్రులందరికీ అందజేస్తున్నాము. ఈ మందు కోసం అందరూ తమ ఐడీ కార్డు చూపించి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము .దీనికి సంబంధించి ఇంకేమి కావాలన్నా సురేందర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన పూర్తి వివరాలు మీకు అందజేస్తాడు. అలాగే మొదట  అందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా సరిపోకపోతే సునీల్  రెడ్డి గారిని అడిగి  ఈ మందు   తెప్పిస్తాము అని అన్నారు. 


 *ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్,   నిర్మాత సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ* ..మాది నెల్లూరు అవ్వడంతో  చాలామంది ఫోన్లు చేసి ఈ మందు కావాలని అడగడం జరిగింది. నేను సునీల్ గారితో మాట్లాడి మన వంతు ఇలాంటి మంచు సహాయం చేద్దామని మాట్లాడి  ఈ మందు పంపిణీ చేద్దామని నిర్ణయించుకొని మేము ఈ మందును జాగ్రత్తగా ప్యాక్ చేయించుకుని ఇది ఎలా వాడాలో పాంప్లేట్ లో ప్రిస్క్రిప్షన్ తయారు చేయించుకుని ఒక కవర్లో పెట్టి ఫిలిం ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్ , స్టాఫ్ కు  మరియు మీడియా మిత్రులకు ఇవ్వాలని జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది 

దీనిపైన మీకు ఏ విధమైన డీటెయిల్స్ కావాలనే నన్ను సంప్రదించగలరు. ఇది ఫిలిం ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, స్టాఫ్ కు  మరియు మీడియా మిత్రులకు సరిపోకపోతే నన్ను కాంటాక్ట్ చేస్తే మరింత మందు తీసుకువచ్చి అందరికీ అందే విధంగా చూస్తామని అన్నారు


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again