Home » » Agrajeeta Movie Started in Australia

Agrajeeta Movie Started in Australia

 


ఆస్ట్రేలియా లో ఘనంగా ప్రారంభం అయిన  అగ్రజీత  

రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అగ్రజీత. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని  శివ విష్ణు ఆలయం లో ఘనంగా ప్రారంభించారు. ఈ అగ్రజీత చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియా లోనే చిత్రీకరిస్తారు.


ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ "అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవి లోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథ తో మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు.  మా చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది" అని తెలిపారు. 


బ్యానర్ : సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ 


సినిమా పేరు : అగ్రజీత


నటి నటులు : రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల మరియు తదితరులు 


కెమెరా మాన్ మరియు ఎడిటింగ్ : సందీప్ రాజ్ 


పి అర్ ఓ : పాల్ పవన్ 


సంగీతం : సిద్ధార్థ్ వాట్కిన్స్ 


కథ మరియు కో డైరెక్టర్ : కృష్ణ రెడ్డి లోక 


స్క్రీన్ ప్లే మరియు డైరెక్షన్ : సందీప్ రాజ్


Share this article :