Home » » Thamanna Aha Originals 11th Hour On April 9th

Thamanna Aha Originals 11th Hour On April 9th

 


ఉగాది సంబరాలు షురూ చేసిన తెలుగు ఓటీటీ 'ఆహా' ..తమన్నా తొలి డెబ్యూ ఒరిజినల్‌ 'లెవన్త్‌ అవర్‌' టీజర్‌ విడుదల

'చక్ర వ్యూహం'లో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్‌ చేసుకోవాల్సి వస్తుంది' అని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇంతకీ ఆమె చిక్కుకున్న చక్రవ్యూహం ఏంటి? అనేది తెలియాలంటే 'లెవన్త్‌ అవర్‌' వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్‌. 'లెవన్త్‌ అవర్‌' ఒరిజినల్‌లో తమన్నా అరత్రికా రెడ్డి అనే శక్తివంతమైన, ధైర్యవంతురాలైన మహిళ పాత్రలో కనిపించనున్నారు.  తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న  తెలుగు ఓటీటీ ఆహా.. వారి ప్రియమైన తెలుగు ప్రేక్ష‌కులకు ఉగాది సంబరాలను ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుగానే తీసుకొస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్  ‘లెవన్త్ అవర్’ ప్ర‌సారం కానుంది.  సోమవారం  ‘లెవన్త్ అవర్’ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూస్తే .. 

మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్ కంపెనీ అనుకోకుండా ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఈ సమస్యల నుంచి ఆ కంపెనీని బయట పడేయటానికి అర‌త్రికా రెడ్డి సీఈఓగా బాధ్యతలను చేపడుతుంది.

'నేనప్పుడే చెప్పాను.. కంపెనీ రన్‌ చేయడం దాని వల్ల కాదు అని..' అని తండ్రి జయప్రకాశ్‌ కూతురు తమన్నాను ఉద్దేశించి చెప్పే సందర్భం చూస్తే  అసలు అరత్రికా రెడ్డి ఈ సమస్యను ఎలా తీరుస్తుందనే దానిపై ఎవరికీ నమ్మకం ఉండదు. స్వయానా ఆమె తండ్రి కూడా నమ్మడు అని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. 

స్నేహితులతో చేసే పోరాటం, కాలంతో చేసే పోరాటం, శత్రువులతో చేసే పోరాటం..' మరి వీటి నుంచి అరత్రికా రెడ్డి తన కంపెనీని ఎలా గట్టెక్కిస్తుంది. పురుషాధిక్యత ప్రపంచంలో మహిళలు అబలలు కాదు.. సబలలు అని నిరూపిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం 'లెవన్త్‌ అవర్‌' ఒరిజినల్‌ చూడాల్సిందే. 

ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 9న ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన‌ తెలుగు వెబ్ సిరీస్‌లో అతి పెద్ద వెబ్ సిరీస్‌. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి ఈ సిరీస్‌కు రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై  ఈ ఒరిజిన‌ల్ రూపొందించారు కూడా. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. 

ఆస‌క్తిక‌ర‌మైన  క్లాసిక్ చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌తో 'ఆహా' అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే తెలుగు వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగువారి లోగిళ్లను ఎంటర్‌టైన్మెంట్‌తో నింపేయడానికి మరింత ఆసక్తికరమైన అంశాలతో సన్నద్ధమవుతుంది. 

న‌టీన‌టులు:

త‌మ‌న్నా, అరుణ్ అదిత్‌, వంశీ కృష్‌ణ‌, రోషిణి ప్ర‌కాష్‌, అభిజీత్ పూండ్ల‌, శ‌త్రు, మ‌ధుసూద‌న్ రావు, జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్రా లోకేష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనిరుద్ బాలాజీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌:  ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి

ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు

ఎడిట‌ర్‌:  ధ‌ర్మేంద్ర కాక‌రాల

సినిమాటోగ్ర‌ఫీ:  ముఖేష్.జి

సంగీతం:  భ‌ర‌త్, సౌర‌భ్‌


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again