Home » » Jaisena Running Successfully

Jaisena Running Successfully

 `జైసేన` సినిమా పాజిటీవ్ మౌత్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది -  ద‌ర్శ‌క‌నిర్మాత వి.స‌ముద్ర‌.



శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మించిన‌ చిత్రం 'జై సేన`‌.  జ‌న‌వ‌రి 29న గ్రాండ్‌గా విడుద‌లై ఈ  చిత్రం స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా..


రైట‌ర్ చందు మాట్లాడుతూ  - ``రైతుల కోసం చేసిన జైసేన సినిమాని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాజిటివ్‌గా చెప్ప‌డం చాలా బాగుంది. మ‌న‌కు అన్నం పెట్టే రైతు గురించి స‌ముద్ర‌గారు ప్రాణం పెట్టి తీసిన జైసేన సినిమాని చూసి ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.


హీరో ప్ర‌వీణ్ మాట్లాడుతూ - `` మా ఫ‌స్ట్ మూవీకే ఇంత మంచి రివ్యూస్ రావ‌డం చాలా హ్యాపీగా ఉంది.  మంచి ఆశ‌యంతో తీసిన ఒక మంచి సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాం. మాకు స‌పోర్ట్ చేస్తున్నప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.


హీరో అభిరామ్ మాట్లాడుతూ - ``జ‌న‌వ‌రి 29న రిలీజైన మా జైసేన సినిమాకి మంచి పాజిటీవ్ టాక్ వ‌స్తోంది. ఇలానే మా సినిమాని ఇంకా ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను` అన్నారు.


హీరోయిన్ నీతు గౌడ ‌మాట్లాడుతూ - `` నిన్న ఆడియ‌న్స్‌తో క‌లిసి థియేట‌ర్లో సినిమా చూశాను. ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ వ‌స్తోంది ఇంకా సినిమా చూడ‌నివారు ఎవ‌రైనా ఉంటే వెళ్లి  త‌ప్ప‌కుండా సినిమా చూడండి`` అన్నారు.


చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ  -  ``మా జైసేన సినిమా జ‌న‌వ‌రి 29న గ్రాండ్‌గా రిలీజై పాజిటీవ్ మౌత్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్అవుతోంది. సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు ఈ మ‌ధ్య‌కాలంలో ఎన్నో సినిమాలు చూశాం కాని ఈ రోజు ఒక మంచి సినిమా చూశాం అని ఎంతో సంతోషంతో చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. కాని కొంత మంది ఈ సినిమాని  కొంత‌మంది రాజ‌కీయ‌నాయ‌కుల‌కు వ్య‌తిరేకంగా తీశాను అని ప్ర‌చారం చేస్తున్నారు. అలాంటిదేం లేదు ఈ సినిమాలో రైతుల స‌మ‌స్య‌ల‌కి  మంచి ప‌రిష్కారం చూపించాం త‌ప్ప ఎవ్వ‌రిని కించ‌ప‌ర‌చ‌లేదు. కావాలంటే మీరు ఈ సినిమాని చూసుకోవ‌చ్చు. యూత్‌, ముఖ్యంగా చ‌దువుకునే యువ‌త భాధ్య‌త ఎంటి అనేది మెయిన్ థీమ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్, నీతు గౌడ ఇలా  ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా సునీల్‌గారు ఈ మ‌ధ్య కాలంలో చేసిన ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ అని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూడండి త‌ప్ప‌కుండా మీకు న‌చ్చుతుంది`` అన్నారు.


శ్రీకాంత్‌, సునీల్‌, తార‌క‌ర‌త్న‌,  శ్రీరామ్‌,  శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌, నీతుగౌడ‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు న‌టించిన  ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: వాసు, సంగీతం: ఎస్‌. రవిశంకర్‌, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార‌వ‌తిచంద్‌, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ,  డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కన‌ల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: పి.ఆర్. చంద్ర‌యాద‌వ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: వి. గోపాల కృష్ణ‌. కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేసినేని శ్రీనివాస్‌, స‌మ‌ర్ప‌ణ‌: విజ‌య‌ల‌క్ష్మి, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.


Share this article :